అన్యాక్రాంతమవుతున్న ఎండోమెంట్ ల్యాండ్

 వ్యాపార సంస్థలతో ఎగనామం పెడుతున్న వైనం 

అన్యాక్రాంతమవుతున్న ఎండోమెంట్ ల్యాండ్

 కోట్ల విలువ చేసే భూములు హాంఫట్ 

 అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి.

నమస్తే భారత్, రాజేంద్రనగర్, మే 06. కోట్ల విలువ చేసే దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకునే నాధుడే కరవయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువులు కుంటలు కబ్జాల పరంపర కొనసాగుతుండగా ఇప్పుడు దేవాలయ భూములకు కొందరు పెద్దలు ఎసరు పెడుతున్నారు. ప్రభుత్వ భూములకు దేవాలయ భూములకు కాదేది కబ్జాకనర్హం అంటూ ఇష్ట రీతిగా   అన్యాకురాంతమవుతున్న అటువైపు అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గాని దృష్టి సారించడం లేదు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని  అమ్మపల్లి దేవాలయ భూముల్లో ఇష్టా రీతిగా నిర్మాణాలు వెలుస్తున్నాయి అనడానికి ఇదో ఉదాహరణ గతంలోనే వ్యాపార సంస్థల పేరుతో కొంత భూమి ఆక్రమణల గురికాగా ప్రస్తుతం దేవాలయ నిర్మాణం కోసం అంటూ తవ్వకాలు మొదలు పెడుతున్నారు. ఇటీవల వయాసిస్ స్కూల్ పక్కనగల అమ్మపల్లి దేవాలయ భూముల్లో మట్టి మాఫియా జోరుగా సాగుతుందని స్థానికుల ఆరోపిస్తున్నారు. దీనికి తోడు పెద్ద ఎత్తున నిత్యం పదుల సంఖ్యలో జెసిబిలు మట్టి తవ్వకాలు చేపడుతున్నాయని, ఫిర్యాదుల అందినప్పటికీ అధికారుల్లో చలనం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. అమ్మపల్లి దేవాలయ భూములు వేల ఎకరాల్లో ఉన్న భూములు కోట్ల విలువ పలుకుతుండడంతో కబ్జాకోరులు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అన్యాక్రాంతం చేస్తూ ఆక్రమణలు గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు వ్యక్తులు ఆరోపణలు పట్టించుకోకుండా ఎవడైతే నాకేంటి అంటూ పెద్ద ఎత్తున రాత్రి పగలు మట్టి మాఫియాతో జోరుగా జెసిబిలు నడుస్తున్నాయి. అధికారులు ఫిర్యాదుల అందినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంలో మతలమేమిటో అర్థం కావటం లేదని ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి దేవాలయాల భూములను అన్యాక్రాంతం కాకుండా నిర్మాణాలు చేపడుతున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

పినపాక హౌసింగ్ ఏఈ గా గుమ్మడి వినీత బాధ్యతలు పినపాక హౌసింగ్ ఏఈ గా గుమ్మడి వినీత బాధ్యతలు
నమస్తే భారత్: పినపాక : పినపాక మండల నూతన హౌసింగ్ ఏఈ గా గుమ్మడి వినీత బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఏఈ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు...
మండలంలో పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి
వేసవి  శిబిరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్
10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని సన్మానించిన రాజ్ కుమార్ రెడ్డ
హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో, సీనయ్య ను,పరామర్శించిన , బంగ్లా,కాంత్ రెడ్డి
అన్యాక్రాంతమవుతున్న ఎండోమెంట్ ల్యాండ్
శంషాబాద్ లో 21st సెంచరీ కళాశాల విద్యార్థుల కృతజ్ఞత సమావేశం