మహాత్మ జ్యోతిబాపూలే 135వ వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు
On
నమస్తే భారత్ :- కేసముద్రం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఏ ఐ కే స్) కేసముద్రం మండల కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 135వ వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మార్తినేని పాపారావు మాట్లాడుతూ, భారత సమాజంలో సమానత్వం సామాజిక న్యాయం విద్య మహిళా సాధికారత అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడిన సామాజిక సంస్కరణలకు నాందికర్త బడుగు బహుజనోద్ధారకుడు మహాత్మ జ్యోతిబాపూలే ఆదర్శాలను ఆశయాలను నేటి తరానికి తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం కేసముద్రం మండల అధ్యక్ష కార్యదర్శులు నీరు జలంధర్, బొబ్బల యాకోబ్ రెడ్డి, భూమాటి పురుషోత్తం రావు, కల్పల ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
