లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేపర్ బాయ్స్ లకు స్వేటర్ల పంపిణీ

On
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేపర్ బాయ్స్ లకు స్వేటర్ల పంపిణీ

 

నమస్తే భారత్ :-తొర్రూరు

లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు అధ్యక్షులు సూర్నం రామ నర్సయ్య ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో ఆదివారం పేపర్ బాయ్స్ లకు స్పెటర్లను పంపిణీ చేశారు. అనంతరం లావణ్య మెడికల్ నిర్వాహకులు మాదారపు వేణుగోపాల్ తండ్రి మాదారపు కృష్ణమూర్తి జ్ఞాపకార్థం మెడికల్ షాప్ ముందు అన్నప్రసాద వితరణ చేశారు.ఈ సందర్భంగా పిడిజి లయన్ డాక్టర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పేపర్ బాయ్స్ లు తెల్లవారుజామున చలిలో వణుకుతూ పేపర్లను వేస్తున్నారని, అందుకు గమనించి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వేటర్లను అందజేయడం.అభినందనీయమన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రామ నర్సయ్య మాట్లాడుతూ పేపర్ బాయ్స్ లు తెల్లారక ముందే వివిధ పత్రికలను పాఠకులకు అందజేస్తున్నారని అన్నారు. సేవలందిస్తున్న పేపర్స్ పేపర్ బాయ్స్ లకు ఆనందం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్సీలు లయన్ దామెర సరేష్, లయన్ డాక్టర్ యాదగిరి రెడ్డి, లయన్ విశ్వేశ్వర రావు, పి.వెంకటేశ్వర్లు క్లబ్ సెక్రటరీ ముడుపు రవీందర్ రెడ్డి, ట్రెజరర్ వజీనపల్లి శ్రీనివాస్,జాయింట్ సెక్రటరీ లయన్ బోనగిరి శంకర్, లయన్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise