ఘనంగా ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలు

On
ఘనంగా ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలు

 

మొట్టమొదటి ఏకైక మహిళ ప్రధాని ఇందిరాగాంధీ

గరీబీ హటావో నినాదంతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఇందిరాగాంధీ 

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని


నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 19_)  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఉక్కు మహిళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కోనేరు సత్యనారాయణ  ( చిన్ని) ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో కొత్తగూడెం పట్టణంలోని రైల్వేస్టేషన్లో గల రైల్వే స్టేషన్ సమీపంలో గల స్వర్గీయ ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమములో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళ ప్రధాన మంత్రి మన ఇందిరాగాంధీ అని పేర్కొన్నారు.ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా మూడు పర్యాయాలు 1980లో 4వ ప్రధాన మంత్రి గా పని చేసిందన్నారు. ఆమె భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ  ఏకైక కుమార్తె అని వివరించారు. నెహ్రూ మొదటి సారి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ప్రధాన మంత్రి కి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేయడం జరిగిందన్నారు. 1964 సం లో తండ్రి మరణం తర్వాత రాజ్యసభకు ఎన్నికవ్వవడమే కాకుండా ప్రధానిగా దేశానికి ఎన లేని సేవలు అందించిన ఘనత ఇందిరా కి దక్కిందని కోరుకొన్నారు. అయితే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే స్వర్గీయ ఇందిరాగాంధీ  రాజభరణలు రద్దు చేయడం  లో కీలక పాత్ర పోషించి రద్దు చేసింది ని కోనేరు చిన్ని వివరించారు. అంతేకాకుండా "గరీబి హటావో "అనే నినాదాన్ని కూడా ప్రకటించి ప్రపంచ దేశాల్లోనే చర్చినియాంసంగా చేశారన్నారు. దేశంలోనే ప్రతి పేదవారికి నివాసముండేందుకు ఇల్లు, తినేందుకు తిండి గింజలు ఏర్పాటు చేసేందుకు కూడా అనేక చర్యలు చేపట్టి భారతదేశ ప్రజల మనుషుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. భారతదేశంలో సుభిక్షంగా ఉంచేందుకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఎనలేని కృషి చేశారన్నారు. దేశానికి ఎంతో మేలు చేస్తున్న సమయంలో ఇందిరా గాంధీని కొంతమంది ముష్కరులు హతమార్చడం పట్ల దేశ ప్రజల్లో ఆందోళనకు గురయ్యారు. భారత దేశ ప్రజలను సుభిక్షంగా ఉంచాలని ఆలోచనతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ వచ్చారన్నారు.కాగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ పేరుతో పక్కా గృహాలు మంజూరు చేస్తూ ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేందుకు కృషి చేస్తున్నాను అన్నారు. అలాగే భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని దృక్పథంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందిరాగాంధీ జిందాబాద్... కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.. అంటూ కాంగ్రెస్ శ్రేణులునినాదాలు చేశారు.*


 ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్, కాంగ్రెస్ మహిళా కమిటీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, కొత్తగూడెం సొసైటీ అధ్యక్షులు మండే వీర హనుమంతరావు,సౌత్ సెంట్రల్ రైల్వే సలహా బోర్డు సభ్యులు వై శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు పూనెం శ్రీనివాస్,నాయకులు చింతలపూడి శేఖర్,ఆన్తోటి పౌల్, సుందర్లాల్ కోరి తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise