ఎమ్మెల్యే అనుచరుడు వైన్ షాప్ కోసం రోడ్డుపై షేడ్స్ అక్రమ నిర్మాణాలు.. ఆకుల సతీష్ & నల్ల జై శంకర్ గౌడ్
(నమస్తే భారత్
దుండిగల్ మెయిన్ రోడ్, కైసర్ నగర్ వెళ్లే రహదారి వద్ద ఉన్న సర్వే నంబర్లు 350, 351 ప్రాంతంలో ఆక్సిజన్ హోమ్స్ అపార్ట్మెంట్ సెట్‌బ్యాక్ ప్రాంతంలో ఎలాంటి మున్సిపల్ / HMDA అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.అపార్ట్మెంట్‌కు కేటాయించిన సెట్‌బ్యాక్ స్థలం, ఫుట్‌పాత్ మరియు కైసర్ నగర్ రోడ్ బఫర్ జోన్‌ను ఆక్రమించి దాదాపు 12 పెద్ద షెడ్లను నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణాలు:బాచుపల్లి నుండి దుండిగల్ వైపు,దుండిగల్ నుండి కైసర్ నగర్ వైపు వచ్చే వాహనాలకు జంక్షన్ వద్దనే భారీ ట్రాఫిక్ సమస్యలు సృష్టించే అవకాశం ఉంది.అదే విధంగా, ఈ అక్రమ షెడ్లలో “Liquor Mart” అనే వైన్ షాప్‌ను ఏర్పాటు చేయడం వల్ల:
ఉదయం, సాయంత్రం సమయంలో
హైవే మరియు కైసర్ నగర్ వైపు వచ్చే ప్రజలకు
పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రహదారిపైనే వాహనాలు పార్క్ చేస్తున్నాయి, ఇది:
తీవ్ర ట్రాఫిక్ జామ్‌కు,
ప్రమాదాలకు
ప్రజా భద్రతకు ముప్పుకు దారితీస్తోంది.
ఇంకా ముఖ్యంగా —
ఆక్సిజన్ హోమ్స్ వెస్ట్ సైడ్ ఎంట్రన్స్ వైపు చూపించిన 10 మీటర్ల సెట్‌బ్యాక్ ప్రాంతంలో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భారీ షెడ్ల నిర్మాణం జరగడం పూర్తిగా GHMC బిల్డింగ్ బై-లాస్‌కు విరుద్ధం.
ప్రశ్న
ఇంత పెద్ద స్థాయిలో 12 షెడ్లను అక్రమంగా నిర్మిస్తున్నా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎవరి సహకారంతో ఇవి సాగుతున్నాయి?
⚠️ మా డిమాండ్లు
1. ఆక్సిజన్ హోమ్స్ సెట్‌బ్యాక్ స్థలంలో అక్రమంగా నిర్మించిన 12 భారీ షెడ్లు వెంటనే కూల్చివేయాలి.
2. ఫుట్‌పాత్, రోడ్డుకు సంబంధించిన బఫర్ జోన్ ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
3. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగేలా సహకరించిన టౌన్ ప్లానింగ్ అధికారులపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి.
4. అక్రమ షెడ్లలో ఏర్పాటు చేసిన Liquor Mart వైన్ షాప్ అక్రమ నిర్మాణాలపై వారం కిందట ఫిర్యాదు చేసిన మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఎమ్మెల్యే వివేక్ అనుచరుడు వ్యాస్ గౌడ్ కు సంబంధించిన లిక్కర్ షాప్ కావడమే వల్లనే అధికారులు చర్యలు తీసుకోలేదని,తక్షణమే అక్రమ షాపుల నిర్మాణంపై & సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలి.
ఈ కార్యక్రమంలో నల్ల జై శంకర్ గౌడ్,పున్నారెడ్డి, పులి బలరాం, చందు, శ్యామ్, దేవర రమేష్, అరుణ్ రావు, రాము, భీమరాజు తదితరులు పాల్గొన్నారు.
