పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం

On
పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం

 

తుగ్గలి:(నమస్తే భారత్) కర్నూలు జిల్లా రిపోర్టర్ చిప్పగిరి రాము: పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా రెవెన్యూ అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.శనివారం రోజున తుగ్గలి మండల పరిధిలోని గల జొన్నగిరి గ్రామం నందు రెవెన్యూ అధికారులు గ్రామ ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు మాట్లాడుతూ ప్రజలందరూ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు.ప్రస్తుత సమాజంలో ప్రతి పౌరునికి గల హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన తెలియజేశారు.ప్రతి ఒక్కరూ హక్కులపై మరియు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో కాశీ రంగస్వామి, వీఆర్వో గోపాలకృష్ణ, జొన్నగిరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రమేష్,జొన్నగిరి పోలీస్ సిబ్బంది, సిఆర్పి నాగేష్,జొన్నగిరి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share On Social Media

Related Posts

Latest News

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే #Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు
ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు
#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం
హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

Advertise