అట్టహాసంగా దివ్యాంగుల ఆటల పోటీలు

On
అట్టహాసంగా దివ్యాంగుల ఆటల పోటీలు

 

నారాయణపేట జిల్లా / నమస్తే భారత్
 
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు  శనివారం జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లా మహిళా,శిశు, దివ్యాంగులు,  వయోవృద్ధులు & ట్రాన్స్ జెండర్ల సాధికారత సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల  క్రీడా పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్. జీ.ఎఫ్ జిల్లా కార్యదర్శి  శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.దివ్యాంగులకు ఉల్లాసం,ఆత్మస్థైర్యం  కల్పించడం కోసమే ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని,దివ్యాంగులు అధికఇ సంఖ్యలో పాల్గొని జిల్లా స్థాయిలో నైపుణ్యం చూపాలని ఆకాక్షించారు.జిల్లాలో ప్రతిభ చూపిన వారిని హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు జిల్లా తరపున పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు. దివ్యాంగులు ఉత్సాహంగా ఈ క్రీడల్లో పాల్గొని తమలోని క్రీడా నైపుణ్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న  సీ డీ పీ వో జయ  మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ సహకారంతో ఈ క్రీడలను  నిర్వహించడం జరుగుతుందన్నారు.   వికలాంగులు ఐకమత్యంతో ఆనందంగా పోటీలలో పాల్గొనాలని కోరారు.  గెలిచినా..ఓడినా అందరూ సమానమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్. ఆర్.ఓ  సాయి, డీ డబ్ల్యు ఓ సిబ్బంది, వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు  నగేష్ గౌడ్, అజీజ్ ఖాన్, కాశప్ప, రాధా, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise