Tag
Daily post
Telangana 

TWJF : బసవపున్నయ్య శాశ్వత బహిష్కరణ

TWJF : బసవపున్నయ్య శాశ్వత బహిష్కరణ హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లో అనేక అక్రమాలకు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్న ప్రధాన కార్యదర్శి BASAVAPUNAIAH సంఘ ద్రోహి అని, అతనిని ఫెడరేషన్ యూనియన్ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు పలువురు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, వ్యవస్థాపక సభ్యులు ప్రకటించారు. గురువారం హైదరాబాద్ లో TWJF రాష్ట్ర అధ్యక్షుడు  మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్, వల్లాల జగన్, రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు,కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడి బాపురావు,సీనియర్ జర్నలిస్టులు, వ్యవస్థాపక సభ్యులు ఎం.యాదగిరి, కే. సారంగపాణి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అశోక్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడినైన మామిడి సోమయ్యతో పాటు మరో నలుగురు సీనియర్ నాయకులు, వ్యవస్థాపక సభ్యులను సంఘం నుంచి బహిష్కరించినట్లు బసవపున్నయ్య ప్రకటించడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది.
Read More...

Advertisement