తమ్ముడు కోసం నితిన్‌, వేణు శ్రీరామ్‌ టీం నయా ప్లాన్‌.. ఏంటో తెలుసా..?

On
తమ్ముడు కోసం నితిన్‌, వేణు శ్రీరామ్‌ టీం నయా ప్లాన్‌.. ఏంటో తెలుసా..?

టాలీవుడ్ యాక్టర్‌ నితిన్ చివరగా యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ రాబిన్‌ హుడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. చాలా కాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న నితిన్‌ తాజాగా పవన్‌ కల్యాణ్ టైటిల్‌ ‘తమ్ముడు’ తో థియేటర్లలోకి రాబోతున్నాడని తెలిసిందే. ఈ చిత్రానికి వకీల్‌ సాబ్‌ ఫేం వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.కాంతార ఫేం సప్తమి గౌడ ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని జులై 4న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. సీబీఎఫ్‌సీ ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ మూవీకి క్లీన్‌ యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు కొన్ని కట్స్‌ను టీం మెంబర్స్‌కు సూచించినట్టు ఫిలింనగర్‌ సర్కిల్ సమాచారం. అయితే ఉత్తమ థ్రియాట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు దిల్‌ రాజు, వేణు శ్రీరామ్‌ ఏ సర్టిఫికెట్‌తోనే ప్రేక్షకుల ముందుకెళ్లాలనుకుంటున్నారట. మరి నితిన్‌ టీం ఈ సారి తీసుకోబోతున్న స్ట్రాటజీ సినిమాకు ఎంత ఉపయోగపడుతుందో చూడాలిఈ చిత్రంలో లయ, లబ్బర్ పండు ఫేం స్వసిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్‌ సచ్‌దేవ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాంతార ఫేం అజనీశ్‌ లోక్‌నాథ్‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌ అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు-శిరీష్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. తమ్ముడు డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ ను పాపులర్ డిజిటల్‌ ప్లాట్‌ ఫాం అమెజాన్ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకుంది.

Tags

Share On Social Media

Related Posts

Latest News

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే #Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు
ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు
#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం
హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

Advertise