యూపీఐ సేవల్లో మళ్లీ అంతరాయం.. సోషల్‌ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు

On
యూపీఐ సేవల్లో మళ్లీ అంతరాయం.. సోషల్‌ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు

 దేశవ్యాప్తంగా యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌  సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీఐ ద్వారా జరిగే ఆన్‌లైన్  దాదాపు గంట నుంచి నిలిచిపోయాయి.డౌన్‌డిటెక్టర్‌ ప్రకారం.. ఇవాళ ఉదయం 11:26 గంటల ప్రాంతంలో యూపీఐ సేవల్లో సమస్య తలెత్తింది. 11:45 గంటల సమయానికి అది మరింత తీవ్రమైంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి సేవలు పనిచేయడం లేదు. ఈ సమస్యపై వినియోగదారులు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. నెట్‌వర్క్‌ స్లో అని, బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం కూడా సాధ్యం కావట్లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్‌ చెల్లింపుల్లో సమస్యల గురించి 222 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో యూపీఐపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) ఇంకా స్పందించలేదు. కాగా, మూడు వారాల్లో ఇలా యూపీఐలో సమస్యలు తలెత్తడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

About The Author

Tags

Share On Social Media

Related Posts

Latest News

RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు
RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపల్ కేంద్రంలో వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌ద‌సంచల‌న్ కార్య‌క్ర‌మం నిర్వహించారు. చేవెళ్ల గ్రామ రచ్చబండ హనుమాన్ దేవాలయం...
Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు
JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన
గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా
PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు

Advertise