దారుణం ముళ్ళ పొదల్లో నవజాత శిశువులభ్యం- 108 సిబ్బంది దేవుడిలా వచ్చి కాపాడారు

నమస్తే, భరత్,30=11=2025=నారాయణపేట జిల్లా
*ముళ్ళ పొదల్లో అనాధ పసిపాప ఏడుపు విని - 108 అంబులెన్స్ కు పిలుపు*
*నవజాత శిశువుకు ఊపిరి పోసిన 108 సిబ్బంది*
*శిశువును ఆక్సిజన్ సహాయంతో 108అంబులెన్స్ లో తరలింపు*
*ముళ్ళ పొదలలో నవజాత శిశువు ఆచూకీ - రక్షించిన 108 సిబ్బంది*
*ముళ్ళ పొదల్లో మిగతా జీవిగా పడి ఉన్న పసిపాపను కాపాడిన 108 అంబులెన్స్ సిబ్బంది*
నారాయణపేట జిల్లా : నారాయణపేట మండలంలోని అప్పక్ పల్లి గ్రామ సమీప0లో జరిగింది. గ్రామ సమీపాన " కాటన్ మిల్లి సమీపంలో "ముళ్లపొదల్లో ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. స్థానికులు పాప ఏడుపులు విని... స్థానిక యువకులు జిల్లా108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108సిబ్బంది వుటవుట్టిన సంఘటన స్థలానికి చేరుకొని, ఆ నవజాత శిశువు చూసి చలించిపోయి,చిన్న గాయాలతో మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న నవజాత శిశువును గమనించిన టెక్నీషియన్స్ శిరీష" అంబులెన్స్ లోనే ప్రథమ చికిత్స అనగా ఆక్సిజన్, నవజాత శిశువు సంరక్షణ పద్ధతులను పాటిస్తూ, దగ్గర్లో ఉన్న నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మహేందర్ గారు పరీక్షించి, ప్రస్తుతం శిశువు ఆరోగ్యం మెరుగ్గానే ఉందని చెప్పారు. నారాయణపేట జిల్లా 108 సిబ్బంది, టెక్నీషియన్ శిరీష, పైలెట్ రాములు, లాను స్థానికులు మరియు జిల్లా ఆసుపత్రి వైద్యులు మరియు నారాయణపేట జిల్లా 108 సూపర్వైజర్ రాఘవేంద్ర గారు అభినందించారు
