Tag
shamshabad ci
Telangana 

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్  కురుస్తున్న వర్షాలకు తగిన జాగ్రత్తలను పాటించాలి : షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ వినాయక చవితి సందర్భంగా ప్రజలు ప్రశాంతత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని షాద్ నగర్  ఏసిపి లక్ష్మీనారాయణ అన్నారు. గణేష్ ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో పోలీస్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాంతి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గణేష్ మండప నిర్వాహకులు ఆన్లైన్ అనుమతులు తప్పకుండా తీసుకోవాలని గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుందన్నారు. కురుస్తున్న వర్షాలకు మండపాల వద్ద తగిన జాగ్రత్తలను పాటించాలని సూచించారు. గణేష్ ఉత్సవాలలో భాగంగా అనుమానస్పదంగా ఎవరైనా ఉంటే వెంటనే 100కు డయల్ చేయాలన్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి  అధికారులు అందుబాటులో ఉంటూ అన్ని ఏర్పాట్లు చేయనున్నారని వివరించారు.పట్టణ సీఐ విజయకుమార్, కమిషనర్ సునీత, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకుడు బండారి రమేష్, ఉత్సవ కమిటీ నాయకుడు అందె బాబయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, విద్యుత్ శాఖ ఏడి సత్యనారాయణ, ఎంవీఐ వాసు, ఫైర్ స్టేషన్ అధికారి జగన్, న్యాయవాది చెంది మహేందర్ రెడ్డి, ముస్లిం నాయకులు మాట్లాడుతూ షాద్ నగర్ పట్టణంలో పర్వదినాలన్నిటిని హిందూ ముస్లింలు సోదర భావంతో జరుపుకుంటున్నారని అన్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండప నిర్వాహకుల పైన ఉంటుందన్నారు. అదేవిధంగా గణేష్ మండపాల వద్ద శుభ్రతను పాటించాలని కోరారు.  మండపాల వద్ద ఫైర్ సిలిండర్లతో పాటు నీటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు అంతయ్య, మురళి, రాములు, గౌస్, ఇబ్రహీం, హరిభూషణ్, వెంకటేష్, వంశీ, యువకులు పాల్గొన్నారు.  
Read More...

Advertisement