Tag
Lions Club
జనగామ 

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ సూర్నం రామ నర్సయ్య ఆధ్వర్యంలో మండలంలోని మాటేడు జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు గురువారం ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేశారు.సందర్భంగా రామ నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే సమయంలో ఒత్తిడికి లోను కాకుండా ఉండాలని, దానికోసం ప్రతిరోజు కొంత సమయం వెచ్చించి వ్యాయామం చేయాలని, ధ్యానం, నడక, సరైన టైం కి నిద్రపోవడం, మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులుగా.ఉంటామన్నారు.ఈమధ్య పిల్లలు సెల్ ఫోన్ వాడకం ఎక్కువ అవుతుందని, దానివల్ల మానసికంగా దెబ్బతింటున్నారని, యువత ఈ వయసులో మంచి ఆరోగ్యంగా ఉండి కష్టపడి చదువుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.వరల్డ్ సైట్ డే సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేసి, కండ్లు గురించి తగు జాగ్రత్తలు, అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ ముడుపు రవీందర్ రెడ్డి, క్లబ్ ట్రెజరర్ వజినపల్లి శ్రీనివాస్,క్లబ్ జాయింట్ సెక్రటరీ బోనగిరి శంకర్, స్కూల్ ఇన్చార్జి హెచ్ ఎం ఎల్ల గౌడ్, ఉపాధ్యాయులు సంజయ్ కుమార్,  రాజు, లయన్ శోభ రాణి, సునీత తదితరులు పాల్గొన్నారు.
Read More...

Advertisement