సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగస్తులను అవమానపరిచే విధంగా మాట్లాడడం బాధాకరం

సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగస్తులను అవమానపరిచే విధంగా మాట్లాడడం బాధాకరం

* ఉద్యోగస్తులకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
* ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ 

నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగస్తులను అవమానపరిచే  విధంగా మాట్లాడడం బాధాకరమని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొత్తగూడెం డివిజన్ మాజీ ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను కోసినా ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేను అంటూ దురుసుగా మాట్లాడడం విచారకరమన్నారు. ఉద్యోగస్తులు అందరూ ప్రభుత్వంలో భాగస్వాములేనని పరిపాలకులు తయారుచేసిన చట్టాలను అమలుపరిచే బాధ్యతను తమ భుజస్కందాల మీద వేసుకొని త్యాగపూరిత గురుతర బాధ్యతను నిర్వర్తించే ఉద్యోగస్తులను బాధ పెట్టి అవమానపరిచే ఏ ప్రభుత్వము మనుగడ సాగించలేదని చరిత్ర చెబుతున్నదని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక ఇంటికి తండ్రిగా ఉన్న యజమాని కుటుంబాన్ని ఏదో ఒక విధంగా పోషించాల్సిన బాధ్యత తనదేనని ఆ బాధ్యతను విస్మరించి నేను పోషించలేను అని అనడం అసమర్థతకు నిదర్శనమని అన్నారు. ఇదే విషయమై మాజీ  గవర్నర్ మాజీ సీనియర్ ముఖ్యమంత్రి ఆర్థిక అపరచాణక్యుడు రోశయ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు అమలు పరచలేని ఇబ్బడి ముబ్బడి వాగ్దానాల నిచ్చి గెలుపు కొరకు ప్రజలను మభ్యపెట్టి గెలిచినంక ఆదాయం అప్పులు కట్టడానికే సరిపోతుందని ఆదాయ వనరులు లేవని గత ప్రభుత్వం మొత్తం లూటీ చేసుకుని వెళ్లిందని మాట్లాడడం అసమర్థతకే నిదర్శనమని అది ఎంత మాత్రం చెల్లుబాటు కాదని అన్న మాటలను ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల గుర్తు చేశారు.ఎన్నికల స్టంట్ గా గెలవడానికి సంక్షేమ పథకాలు అంటూ ఆచరణకు సాధ్యం కానీ స్కీములను వాగ్దానం చేసి ప్రభుత్వ ఆదాయం అంతా ఆ సంక్షేమ పథకాల అమలుకే ఆదాయమంతా సరిపోతుందని బహిరంగంగా మాట్లాడడం అటు ప్రజలలోను ఇటు ప్రతిపక్షాలలోనూ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగజారుస్తుందన్న ఆలోచన కూడా లేకుండా ఈ ప్రభుత్వం నడవడం ఎంతో విచారకరమన్నారు. నియంతృత్వ ప్రజా కంటక దుష్ట పరిపాలన అంతం కావాలని ప్రజాస్వామ్య పరిపాలనతో కూడిన ప్రభుత్వం ఏర్పడాలని తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగస్తులందరూ కూడా ముక్తకంఠంతో ఎలుగెత్తి సంఘటితమై ఒక చారిత్రాత్మక ఉద్యమంలా భాగస్వాములై
మేము సైతం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా రేవంత్ రెడ్డిని అంగీకరించి ఆమోదించి అనుసరించి ఎన్నో అడ్డంకులను ఎదిరించి ఒక యజ్ఞంలా ఎన్నికలలో పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని చారిత్రాత్మక విజయంతో గెలిపిస్తే ఉద్యోగులను అవమానపరిచే విధంగా మాట్లాడడం అత్యంత బాధాకరమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను విస్మరించి తమ ప్రభుత్వ ఏర్పాటుకు అసలు సిసలైన మూల స్తంభాలాంటి ఉద్యోగస్తులను అవమానపరచడం అగౌరవ పరచడం యదార్ధ బాధలను గాధలను అవహేళన చేసి వాళ్లను టార్గెట్ చేసి మాట్లాడటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమంజసం కాదని ఇటువంటి అనాలోచిత వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంకా వ్యతిరేకత పెంచుతుందని ఉద్యోగస్తులకు రావలసిన హక్కులను న్యాయంగా ఇవ్వవలసిన రాయితీలను
కల్పించి ఉద్యోగస్తుల కుటుంబాలకు న్యాయం చేసి ఉద్యోగ భద్రత కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొత్తగూడెం డివిజన్ ఉపాధ్యాయ జేఏసీ మాజీ చైర్మన్ భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యింది  హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యింది 
నమస్తే భారత్ / మద్దూరు, (మే 6)  : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం  విఫలమయిందని కొత్తపల్లి మండలం టిఆర్ఎస్...
త్రాగునీరు సరఫరా,ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకం, అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
నర్కుడలో రెడీమిక్స్ లారీ ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
జర్నలిస్టులందరికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి 
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి