Tag
bala nagar dcp suresh kumar
National 

అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలిక మృతి

అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలిక మృతి క్లూస్ టీం సహాయంతో నింధితులను గాలిస్తున్నామని తెలిపిన  బాలానగర్ డిసిపి సురేష్ కుమార్  కూకట్పల్లి : పది సంవత్సరాల బాలిక కత్తిపోట్లతో హత్యకు గురికావడం, కూకట్పల్లి ప్రాంతంలో కలకలం రేపింది. ఈ మర్డర్ సమాచారం అందుకున్న బాలానగర్ డిసిపి సురేష్ కుమార్  సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక పోలిసుల వద్ద వివరాలు తీసుకున్నారు. తదనంతరం మీడియాతో మాట్లాడారు., వివరాలు ఇలా ఉన్నాయి,. కూకట్పల్లిలో నివాసం ఉంటున్న కృష్ణ రేణుక దంపతులకు ఇద్దరు పిల్లలు అందులో పది సంత్సరాల వయస్సున్న కూతురు సహస్ర హత్యకు గురిఅయ్యింది. సహస్ర కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. తల్లి రేణుక స్థానికంగా ల్యాబ్ టెక్నీషియంగా పనిచేస్తుండంగా తండ్రి కృష్ణ బైక్ మెకానిక్. కొడుక్కి స్కూల్ నుంచి బాక్స్ ఇవ్వమని ఫోన్ రావడంతో ఇంటికి వచ్చిన తండ్రి ఇంటి తలుపు గడియ పెట్టడంతో ఓపెన్ చేసి చూడగా బెడ్ పై గాయాలతో పడి ఉన్న కూతురు సహస్ర చూసి వెంటనే 108కి పోలీసులకి సమాచారం అందించాడు. దింతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో నింధితులను గాలిస్తున్నామని డిసిపి స్పష్టం చేసారు. 
Read More...

Advertisement