Tag
namasthe india
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్
Published On
By Journalist Shiva Kumar Bs
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన
కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు
ప్రధాన అతిథులు గా ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ,కె.ఎస్. రత్నం, డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి
విజేతలకు పతకాలు, అభినందన పత్రాలు అందజేసిన అతిథులు
ఏపీలోని వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లను నియమించిన కూటమి ప్రభుత్వం
Published On
By Journalist Shiva Kumar Bs
శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం – పోతుగుంట రమేశ్ నాయుడు
2. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా – కొట్టె సాయి ప్రసాద్
3. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం – వి. సురేంద్ర బాబు (మణి నాయుడు)
4. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి... ఇందిరమ్మ పేస్ -3 పార్కును కాపాడండి
Published On
By Journalist Shiva Kumar Bs
అధికారికి వినతి పత్రం అందించిన
సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ - భారీగా పట్టుబడ్డ మధ్యం
Published On
By Journalist Shiva Kumar Bs
అక్రమంగా అమ్ముతున్న 50 లీటర్ల మధ్యం
నిల్వ ఉంచిన16 డొమెస్టిక్ సిలిండరులు సీజ్
సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు
బ్రేకింగ్: రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ
Published On
By Journalist Shiva Kumar Bs
రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికార దిశగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇవ్వాలా హైదరాబాద్ తాజ్ కృష్ణలో ఏర్పాటుచేసిన పార్టీ స్థాపన సభలో నూతన పార్టీను ప్రకటించరు మల్లన్న. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ మేధావులు, ప్రొఫెసర్స్, అమరవీరుల కుటుంబ సభ్యులు, కళాకారులు వివిధ సంఘాల నాయకులు కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ పై ఫైర్ అయ్యారు. భారత్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నాటి నుండి బీసీలను పార్టీలు ఎలా మోసం చేసాయో వివరించారు.తాజ్ కృష్ణాలో జరిగిన ఈసభకు వేలాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సబ్బన్డ వర్గాలు తరలివచ్చాయి. కార్పొరేటర్ కాలయాపన చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు
Published On
By NAMASTHEBHARAT
ఆల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్ కాలనీ 133 బ్లాక్ దగ్గర డ్రైనేజ్ వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు బిజెపి నాయకుల దృష్టికి తీసుకొస్తే పీజేఆర్ బిజెపి నాయకుడు ప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి పర్యటించరు బిజెపి యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ., ఇండ్ల మధ్య డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమై ఇండ్ల నుండి వచ్చే డ్రైనేజ్ ఇండ్ల మధ్యనే నిలిచిపోవడం వలన దుర్గంధపు వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు అన్నారు. స్థానిక కార్పొరేటర్ కబ్జాలతో కాలయాపన చేస్తూ ప్రజా సమస్యలను పట్టించూసుకోకుండా మోసం చేస్తున్నారు అన్నారు. కేవలం ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కాలనీలలో మాత్రమే ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారే తప్ప నిరుపేదలు, సామాన్య ప్రజలు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు జీవనం సాగిస్తున్న కాలనీలలో చిన్నచూపు చూస్తూ సమస్యలను గాలికి వదిలేస్తున్నారు అన్నారు. ఇప్పటికైనా వెంటనే సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి ఈ డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. పరిష్కారం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాధికారులను, ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి, కేశవరావు, బిజెపి నాయకులు రామరాజు, నర్సింగ్ యాదవ్, సురేష్, జ్యోతి, రాజు, యువత, కాలనీవాసులు పాల్గొన్నారు. ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ పాదయాత్ర
Published On
By NAMASTHEBHARAT
124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎల్లమ్మబండ, పీజేఆర్ నగర్ కాలనీలలో డ్రైనేజీ, పారిశుద్యనికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ కాలనీలలో పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించరు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ., కాలనీలో ప్రధానంగా ఉన్న డ్రైనేజ్ సమస్యను అతిత్వరలో పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కాలనీ లోని డ్రైనేజ్ లైన్స్ కు సంబంధించి అవసమైన బడ్జెట్ ను ఎస్టీమషన్ వేసి ఇవ్వాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆదేశించారు.
కాలనీలో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని, చెత్తను రోడ్ల మీద లేదా బిల్డింగ్ ల మధ్యలో వేయడం వల్ల మీరు మీ పిల్లలు రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి మీరందరు మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని, తడిచెత్తా మరియు పొడిచెత్తను వేరువేరుగా బస్తీకి వచ్చి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని, చెత్తను నాలాలలో గాని, రోడ్లమీద గాని, చెరువులలో గాని వేయవొద్దని ప్రజలను కోరారు. జి.ఎచ్.ఎం.సి సిబ్బంది, కాలనీ అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా పనిచేసి చెత్తను రోడ్లమీద వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలని అన్నారు.
అలాగే మీ ఇంటికి వచ్చి సేవలందించే పారిశుధ్య, ఎంటమాలజి మరియు వైద్య శాఖలకు సంబంధించిన సిబ్బందికి ప్రజలందరూ సహకరించి వారి సూచనలు పాటిస్తూ రోగాలకు దూరంగా ఉండాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జి.రవి, భాస్కర్, గుడ్ల శ్రీనివాస్, మహేష్, బషీర్, సుధాకర్, వెంకట్, చంద్రయ్య, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 45 లక్షల నిధులతో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్
Published On
By NAMASTHEBHARAT
ఫతే నగర్ డివిజన్ పరిధిలోని పిట్టల బస్తీలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో 45 లక్షల రూపాయల నిధులతో పిట్టల బస్తీ వాసుల కోరిక మేరకు స్థానికులతో కలిసి పనులను ప్రారంభించిరు కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ., పిట్టల బస్సులో ST నిధుల కింద 90 లక్షల రూపాయలతో బస్తీ వారి కోసం స్మశాన వాటికను, రోడ్లను అదేవిధంగా కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మించుట కొరకు భూమి పూజ చేయడం జరిగిందని, అనంతరం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న యువత కొరకు జిమ్ ను కూడా అతి త్వరలో యువత కొరకు అందుబాటులోకి తీసుకొస్తామని వారి హామీ ఇవ్వడం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిట్టల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపి, జైపాల్ జయమ్మ, బబ్లు గణేష్, సుధాకర్, కంచి బిక్షపతి, గంగరాజు, కుక్కల రాము, బాగయ్య, రామ గౌడ్, సురేందర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కృష్ణ రావును కలిసిన గ్రీన్ హిల్స్ కాలనీ వాసులు
Published On
By NAMASTHEBHARAT
కుకట్పల్లి : గ్రీన్ హిల్స్ రోడ్డులో గల బహుల అంతస్తుల సముదాయలైన రెయిన్భో విష్టాస్ రాక్ గార్డెన్, మెరినా స్కై, రేయిన్భో విష్టా పేస్ 1 సంఘాలు సంయుక్తంగా శాసనసభ్యులు మాదవరం కృష్ణారావును కలిసి తమ ప్రదానసమస్య గ్రీన్ హిల్స్ రోడ్డు మీద పుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుచేయించ వలసినదిగా కోరడం జరిగినది. దాదాపు 15 వేల మంది నివసిస్తున్న ఈ సముదాయాల నుండి మరియు ఇందులో ఉపాదికోసం రోజు వచ్చే 3వేల పైచిలుకు మహిళలు నిత్యం వేల సంఖ్య లో రోడ్డు కు అటువైపు వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. రానున్న కాలంలో కొత్తగా రాబోయే సముదాయల ద్వారా వేల సంఖ్యలో నివాసాలు రాభోతున్న తరుణంలో పాదచారుల కు ప్రదాన సమస్య కు పుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుచేయించి రంగదాముని మార్గం నుండి మాధాపూర్ కు ప్లై ఓవర్ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేసి శాశ్వత పరిష్కారం చూపమని బండి మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో మూడు సముదాయాల సంఘాల సభ్యులు టి.సత్యనారాయణరెడ్డి, ఓంకార్ రెడ్డి, రామారావు, రామ్ తిలక్, సుమంత్ కుమార్ పాల్గొన్నారు. మాధవరం కృష్ణారావు సానుకూలంగా స్పందించి తక్షణం సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాను అని తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి
Published On
By NAMASTHEBHARAT
గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్
కురుస్తున్న వర్షాలకు తగిన జాగ్రత్తలను పాటించాలి : షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ
వినాయక చవితి సందర్భంగా ప్రజలు ప్రశాంతత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ అన్నారు. గణేష్ ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో పోలీస్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాంతి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గణేష్ మండప నిర్వాహకులు ఆన్లైన్ అనుమతులు తప్పకుండా తీసుకోవాలని గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుందన్నారు. కురుస్తున్న వర్షాలకు మండపాల వద్ద తగిన జాగ్రత్తలను పాటించాలని సూచించారు. గణేష్ ఉత్సవాలలో భాగంగా అనుమానస్పదంగా ఎవరైనా ఉంటే వెంటనే 100కు డయల్ చేయాలన్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి అధికారులు అందుబాటులో ఉంటూ అన్ని ఏర్పాట్లు చేయనున్నారని వివరించారు.పట్టణ సీఐ విజయకుమార్, కమిషనర్ సునీత, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకుడు బండారి రమేష్,
ఉత్సవ కమిటీ నాయకుడు అందె బాబయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, విద్యుత్ శాఖ ఏడి సత్యనారాయణ, ఎంవీఐ వాసు, ఫైర్ స్టేషన్ అధికారి జగన్, న్యాయవాది చెంది మహేందర్ రెడ్డి, ముస్లిం నాయకులు మాట్లాడుతూ షాద్ నగర్ పట్టణంలో పర్వదినాలన్నిటిని హిందూ ముస్లింలు సోదర భావంతో జరుపుకుంటున్నారని అన్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండప నిర్వాహకుల పైన ఉంటుందన్నారు. అదేవిధంగా గణేష్ మండపాల వద్ద శుభ్రతను పాటించాలని కోరారు. మండపాల వద్ద ఫైర్ సిలిండర్లతో పాటు నీటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు అంతయ్య, మురళి, రాములు, గౌస్, ఇబ్రహీం, హరిభూషణ్, వెంకటేష్, వంశీ, యువకులు పాల్గొన్నారు.
