V6 రిపోర్టర్ నర్సింగ్ రావును పరామర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

On
V6 రిపోర్టర్ నర్సింగ్ రావును పరామర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

 

 నమస్తే భారత్,శంషాబాద్: గుండెపోటు కారణంగా శంషాబాద్‌లోని లిమ్స్  మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న V6 రిపోర్టర్ మంచర్ల నర్సింగ్ రావును మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి శనివారం పరామర్శించారు.
​నర్సింగ్ రావు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న సబితా ఇంద్రారెడ్డి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాత్రికేయులు సమాజానికి చేస్తున్న సేవ ఎంతో ముఖ్యమని, నర్సింగ్ రావు లాంటి క్రియాశీలక రిపోర్టర్ త్వరగా కోలుకుని తిరిగి విధుల్లోకి రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
​ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
​సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, మాచర్ల మోహన్ రావు తదితర భారత రాష్ట్ర సమితి (BRS) నేతలు కూడా ఆసుపత్రికి వెళ్లి నర్సింగ్ రావును పరామర్శించారు. పార్టీ తరఫున ఆయన చికిత్సకు అవసరమైన తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. నర్సింగ్ రావు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Share On Social Media

Related Posts

Latest News

Advertise