Tag
latest telangana party
రంగారెడ్డి 

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి బీజేపీ పార్టీ నిర్వహించిన రక్తదాన శిబిరం లో బీజేపీ నేతలు రక్తదానం మోదీ కోసం రక్తమే కాదు ప్రాణాలు ఇవ్వడానికైన సిద్ధమే"ఎంకనోళ్ల వెంకటేష్" బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షాద్ నగర్ సెప్టెంబర్17: భారతప్రదాని పూజ్యులు నరేంద్రమోది 75 వ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం షాద్ నగర్ పట్టణంలోనీ ఏబీ కాంప్లెక్స్ లో షాద్ నగర్ టౌన్ మరియు ఫరూక్ నగర్ మండలం సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం లో బీజేపీ నేతలు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం చాలా సంతోషకరమని. అందులో ఉడతా భక్తిగా తను కూడా రక్త దానం చేయడం తన పూర్వజన్మ సుకృతం అని బీజేపీ నాయకులు ఎంకనోళ్ల వెంకటేష్ పేర్కొన్నారు. ఎంకనోళ్ల వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ., భారత ప్రధాని నరేంద్ర మోదీ  75 వ పుట్టినరోజు సందర్భంగా సేవ భావానికి దాతృతానికి  ఈ దేశం పై ఉన్న ప్రేమ అకుంఠత దీక్షకు ప్రతిఫలంగా రక్తదానం చేయడం చాలా చిన్న విషయం అని ఎన్నో సందర్భాలలో రక్త దానం చేయడం జరిగిందని కానీ ఈ రోజు నరేంద్ర మోదీ పుట్టిన సందర్భంగా రక్తదానం చేయడం చాలా ప్రత్యేకమైంది అని ఆయనకోసం రక్తమే కాదు ప్రాణాలు ఇచ్చిన తక్కువే అని ఆయనకు సేవ చేసుకొనే భాగ్యం ఈ విదంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు నరేంద్ర మోదీ మరో శివాజీ, మరో సుభాష్ చంద్రబోస్,ఆయన ఈ దేశంలో పుట్టడం భారతావని చేసుకున్న అదృష్టం ఇలాంటి మనిషి మల్ల పుట్టాడు అని ఆయన ఉండగా ఈ దేశాని కి ఎలాంటి ముప్పు వుండదని,ప్రత్యర్థుల గుండెల్లో వణుకుపుట్టించే కర్మయోగి ఈ దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిన యోధుడు  నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. ఆ మహనీయుని కోసం ఎంతచెప్పినా తక్కువే ఆడంబరాలకు పోకుండా తన కన్న తల్లి అంత్యక్రియలు అనుకున్న సమయంలో పూర్తిచేసి వెంటనే అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న మకుటం లేని మనిషి నరేంద్ర మోదీ, ప్రధానిగా ఒక్క రోజు సెలవు తీసుకోకుండా నిరంతరం ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తున్న మహోన్నత మైన వ్యక్తి  మోదీ, దేశ హితమే తన ద్యేయంగా దేశ ప్రజలే తన కుటుంబంగా ముందుకు వెళ్తున్న ప్రధాని ఆయురారోగ్యాలతో ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనీ వారికి మరొక్క సారి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య,పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, షేరీ విష్ణువర్ధన్ రెడ్డి,పిట్టల సురేష్,భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
మేడ్చల్ 

అక్రమ విల్లాలపై చర్యలు తీసుకోవాలని - ఆకుల సతీష్, నల్ల జై శంకర్ గౌడ్ ఫిర్యాదు

అక్రమ విల్లాలపై చర్యలు తీసుకోవాలని - ఆకుల సతీష్, నల్ల జై శంకర్ గౌడ్ ఫిర్యాదు మేడ్చల్ గ్రామంలో సర్వే నంబర్లు 879, 881 పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటికి హెచ్ఎండిఏ నుంచి మాన్యువల్ అనుమతులు పొందడమే కాకుండా, చెరువులోనే నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా సహకరిస్తున్నారని గత నెలలోనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని. కానీ చర్యలు తీసుకోకపోవడంతో, సోమవారం అదనపు కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. మరోసారి మేడ్చల్ మున్సిపల్ మేనేజర్‌కు పూర్తి ఆధారాలతో పిర్యాదు అందజేశాం అన్నారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్ అలాగే నల్ల జై శంకర్ గౌడ్ మాట్లాడుతూ., శ్రేయస్ లైఫ్ స్పేసెస్ కన్స్ట్రక్షన్ కంపెనీ, మేడ్చల్ గ్రామంలో పెద్ద చెరువుకు ఆనుకొని సర్వే నంబర్లు 879, 881లో 24.31 ఎకరాల్లో (Proc. No.1064/MED/plg/HMDA/2022) విల్లాల నిర్మాణానికి అనుమతులు తీసుకోవడం జరిగిందన్నారు. చెరువు ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లో నిర్మాణాలకు మాన్యువల్ అనుమతులు హెచ్ఎండిఏ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఇరిగేషన్ అధికారులు కూడా చెరువు పరిధిలో విల్లాల నిర్మాణానికి ఎన్వోసీ ఇవ్వడానికి కారణం, BRS పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు దాదాపు ₹100 కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టడమేనని ఆరోపించారు. ఇప్పటికే చెరువులో 30 వరకు విల్లాలు అక్రమంగా నిర్మించబడుతున్నా, ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఎమ్మెల్యేల సహకారమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే BRS  2ఎమ్మెల్యేల అక్రమ పెట్టుబడులపై దర్యాప్తు జరిపి, మేడ్చల్ పెద్ద చెరువు ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లో మాన్యువల్ అనుమతులు ఇచ్చిన వ్యవహారంపై రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ అధికారులపై విజిలెన్స్ విచారణ జరపాలని, అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రేయస్ లైఫ్ స్పేసెస్ కన్స్ట్రక్షన్ కంపెనీపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చెరువును పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, పి.బి. శ్రీనివాస్, ముకేష్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
Telangana 

దొంగలించిన మేకలు గొర్రెలు జియాగూడ మార్కెట్ లో అమ్మకం

దొంగలించిన మేకలు గొర్రెలు జియాగూడ మార్కెట్ లో అమ్మకం  గత కొన్నేళ్లుగా రెండు జిల్లాలలో భారీగా మేకల, గొర్రెల దొంగతనం   రూ.2.62 లక్షల నగదు, నాలుగు వాహనాలు, 7 మొబైల్ లు, 4 కార్లు స్వాధీనం   మీడియా సమావేశంలో షాద్ నగర్ ఏసిపి ఎస్. లక్ష్మీనారాయణ వెల్లడి  షాద్ నగర్ : కార్లు వేసుకొని సాయంత్రం వేళ సరదాగా బయటికి వెళ్లాలి.. మేకలు, గొర్రెల గుంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకాలి.. అర్ధరాత్రి అటాచ్ చేసి సైలెంట్ గా దోచేయాలి.. జియాగూడ మార్కెట్ కు తీసుకువెళ్లి అమ్మేయాలి.. చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డ యువత ఒక ముఠాగా మారి చేస్తున్న ఈ ఆగడాలకు షాద్ నగర్ పోలీసులు తెరదించారు. రెండు జిల్లాలలో వివిధ చోట్ల దొంగతనాలకు పాల్పడ్డ ఈ ముఠా కు సంబంధించిన వివరాలను ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్ కుమార్ మీడియా సమావేశంలో తెలియజేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం తో పాటు, కర్ణాటక , హైదరాబాదులోని పహాడీ షరీఫ్ ప్రాంతానిలకు చెందిన మహమ్మద్ ఫిరోజ్ (24), అబ్దుల్ కలీం (25), మొహమ్మద్ సోహెల్ (24), షేక్ రవూఫ్ (23), మహమ్మద్ జమీర్ (26), మహమ్మద్ ఆరిఫ్ (25), షేక్ హసీనుద్దీన్ (22), కోయల్ కార్ సాయికిరణ్ (30)లు ఈ దోపిడీ ముఠాలోని సభ్యులు. చిన్నతనం నుంచి చెడు స్నేహాలకు అలవాటు పడి మత్తుపదార్థాలకు బానిసలైన ఈ యువకులు డబ్బు కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం నాలుగు వాహనాలను తమకు అందుబాటులో పెట్టుకున్నారు. ఆయా వాహనాలలో రోజు తిరిగి మేకలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి రాత్రి కాగానే ఒక డీసీఎం తీసుకుని వెళ్లి మేకలను అందులో ఎక్కించి జియాగూడ మార్కెట్లో అమ్మి వేయడం వీళ్లు దినచర్యగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే షాద్ నగర్ పరిధిలో చించోడులో 28, వెలిజర్లలో 8, చౌదరిగుడాలో 8, ఎల్కిచర్లలో 23, కొందుర్గు మండలం తంగెడపల్లిలో 8, వెంకిర్యాలలో 9, పరిగి మండలంలో కోటివాడలో 12, సుల్తాన్ పూర్ లో 30, దోమ మండలం వుదంతారావు పల్లి లో 15, జధిరసం పల్లిలో ఆరు మేకలు, గొర్రెలను దొంగిలించారు. ఇదే రీతిన ఈనెల 14వ తేదీన పురపాలక పరిధిలోని సోలిపూర్ వద్ద దొంగతనానికి పాల్పడుతుండగా షాద్ నగర్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. శంషాబాద్ డిసిపి రాజేష్ పర్యవేక్షణలో సాగిన ఈ విచారణ సిపిఎస్ డిసిపి ముత్యంరెడ్డి, అడిషనల్ డీసీపీ పూర్ణచంద్రరావు, శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, శ్రీలక్ష్మి ల నేతృత్వంలో విచారణ కొనసాగింది. షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్ కుమార్,డిటెక్టివ్ సిఐ వెంకటేశ్వర్లు లో ఆధ్వర్యంలో ఎస్సై లు పవన్ కుమార్, అవినాష్ బాబు, శ్రీనివాస్, భూపాల్, శివారెడ్డి, సిబ్బంది కుమార్, మహేందర్, జాకీర్, నవీన్, రమేష్, రవి, భీమయ్య, రవీందర్, కరుణాకర్, మోహన్ లాల్, జాకీర్, రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Read More...
TS జిల్లాలు  

బ్రేకింగ్: రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ

బ్రేకింగ్: రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికార దిశగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇవ్వాలా  హైదరాబాద్ తాజ్ కృష్ణలో ఏర్పాటుచేసిన పార్టీ స్థాపన సభలో నూతన పార్టీను ప్రకటించరు మల్లన్న. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ మేధావులు, ప్రొఫెసర్స్, అమరవీరుల కుటుంబ సభ్యులు, కళాకారులు వివిధ సంఘాల నాయకులు కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ పై ఫైర్ అయ్యారు. భారత్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నాటి నుండి  బీసీలను పార్టీలు ఎలా మోసం చేసాయో వివరించారు.తాజ్ కృష్ణాలో జరిగిన ఈసభకు వేలాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సబ్బన్డ వర్గాలు తరలివచ్చాయి.
Read More...

Advertisement