ఇందిరమ్మ పేస్-2లో నివసిస్తున్న పేద ప్రజల పై అధికారుల కక్షసాధింపు తగదు. -కె. యేసు రత్నం సిపిఐ రాష్ట్ర నాయకులు.
బలహీనల పై బలవంతుల దౌర్జన్యం నశించాలి.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ పేస్ -2లో నివసిస్తున్న పేద ప్రజలను కొంత కాలంగా ప్రక్కనే వున్న కాలనీ అధ్యక్షులు పిర్యాదుల పేరుతో అనేక రకాలుగా వారిని ఇబ్బందులకు, భయబ్రాంతులకు గురించేస్తున్నారు అన్ని సిపిఐ ఆధ్వర్యంలో ఇందిరమ్మ పేస్ - 2 సందర్శించడం జరిగింది. అనంతరం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ శామ్ సుందర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు కె. యేసు రత్నం, బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ బలహీనల పై బలవంతులు బలప్రయోగం చేయడం సారి కాదు అన్ని సూచించారు. పదే పదే రోడ్డులను వెడల్పు చేస్తున్నాము అనే నేపంతో అధికారులు పేద ప్రజల పై దౌర్జన్యం చేస్తున్నారు అన్ని, నిన్న కొంత మంది అధికారులు రోడ్డు వెడల్పు చేస్తున్నాము అన్ని రోడ్డు ప్రక్కన వున్న ఒక టైలర్ డబ్బా వేసుకొని చాలా కాలంగా స్థానికుల బట్టలు కొడుతున్నాడు. నిన్న ఏ వ్యక్తి డబ్బాను తొలగించారు. ఆది పూర్తిగా అన్యాయం అన్ని వారు ఖండించారు. అలాగే కేవలం ఇందిరమ్మ పేస్ -2 రోడ్డు వెడల్పు చేయడమే కాకుండా ఇక్కడ అయితే రోడ్డు ఆక్రమిచ్చారో అక్కడ తొలగించాలి. కానీ కేవలం పేద ప్రజలవి మాత్రమే తొలగిస్తాము అంటే పేద అన్యాయం చేస్తాము అంటే సిపిఐ పార్టీ సేవించదు అన్ని వారు గుర్తు చేస్తారు. అలాగే ఇందిరమ్మ పేస్ - 2 పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు సిపిఐ పార్టీ పోరాటం చేస్తుంది అన్ని వారు డిమైండు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆశి. యాదయ్య, పొన్నికంటి దస్తగిరి, కుమార్, తులసి, చంద్రవతి, వెంకటేష్, లక్ష్మి, చందు తదితరులు పాల్గొన్నారు.
