ఎక్స్ రే యంత్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కే.ఈ శ్యాంకుమార్ .
On
వెల్దుర్తి(నమస్తే భారత్) మండల కేంద్రమైన వెల్దుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం నూతన ఎక్స్ రే యంత్రాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సూపరిండెంట్ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో డి సి హెచ్ ఎస్ డాక్టర్ జఫ్రుల్ల ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, వైద్యుల పనితీరును, ఆసుపత్రి వసతుల గురించి ఎమ్మెల్యే గారికి తెలియజేశారు. ఆసుపత్రిలో డెంటల్ స్కానింగ్ మిషన్ ఏర్పాటు కొరకు సొంతంగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 30 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
