సిపిఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

On
సిపిఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

 

 క్రీడలు మానసిక ప్రశాంతతకు శరీర దృఢత్వానికి ఎంతో దోహదం చేస్తాయి
 
 విజేతలకు బహుమతుల ప్రధానం

ముఖ్యఅతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య 

 నమస్తే భరత్, రాజేంద్రనగర్, నవంబర్ 28, క్రీడలు మానసిక ప్రశాంతతకు శరీర దృఢత్వానికి ఎంతో దోహదం చేస్తాయని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని  భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్  తొండుపల్లిలోని ఎంపీ ఎస్ క్రికెట్ మైదానంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పాల్గొని ప్రారంభించారు.
 ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు దేశంలో ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయని వాటిని నిలదీయాల్సిన యువత చెడు వ్యసనాలకు బానిసై వాటిని మరిచిపోతున్నారని అన్నారు. యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉందని న్యాయం కోసం ధర్మం కోసం యువత పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. డ్రగ్స్ కు, మద్యానికి బానిసలు కాకుండా దేహ దారుఢ్యాన్ని పెంచే క్రికెట్ లాంటి ఆటలను యువత ఆడాలని దాని ద్వారా రోగాలు రాకుండా నిలువరిస్తాయని మంచి ఫిట్నెస్ కూడా ఉంటుందని ఆయన తెలిపారు.ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలును ఆయన అభినందించారు.
 మొదటి మ్యాచ్ పి.ఎస్. కె. 12, డెక్కన్ క్రికెట్ అకాడమీ క్రికెట్ మ్యాచ్, డెక్కన్ క్రికెట్ అకాడమీ టీం విజయం సాధించిందన్నారు. 
విజయంలో కీలక పాత్ర పోషించిన బ్యాట్స్ మెన్ మీర్జా కు మేన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేశారు.
 ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ యాదగిరి, శంషాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్ యాదవ్, శంషాబాద్ మండల కార్యదర్శి నరగిరి,  అన్యపు ప్రభు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి శివకుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్యార క్రాంతి కుమార్,  విద్యార్థి సంఘం నాయకులు శివ, గిలక రాజు, నరేష్ నాయక్, చందు. రాజు గౌడ్, ప్రవీణ్ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise