నామినేషన్ స్వీకరణ కేంద్రాలు కేటాయింపు
On
ఖానాపురం డిసెంబర్ 2 ( నమస్తే భారత్ ) :
గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం నామినేషన్ స్వీకరణ కేంద్రాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఖానాపురం ఎంపీడీవో డాక్టర్ అద్వైత్య తెలిపారు. నేటి నుండి ఈనెల5 వరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఖానాపురం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఖానాపురం మండలంలోని ఖానాపురం , రంగాపురం ,బుధరావుపేట ,అశోక్ నగర్ , మంగళావారిపేట ,దబ్బీర్ పేట గ్రామ పంచాయతీలలో సమీప గ్రామ పంచాయతీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ లు స్వీకరించబడుతాయన్నారు.
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
