ఏసీబీ వలలో పెద్దవంగర మండల తహసీల్దార్

On
ఏసీబీ వలలో పెద్దవంగర మండల తహసీల్దార్

 

పెద్దవంగర కార్యాలయంలో అధికారుల సోదాలు

నమస్తే భారత్:- పెద్దవంగర

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల తహసీల్దార్ వీరగంటి మహేందర్ ఏసీబీ ఉచ్చులో పడ్డారు. పూర్వీకుల వ్యవసాయ భూమి వారసత్వ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడా నికి అర్జీదారుడి నుంచి రూ.15 వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్ర యించాడు. అధికారులు పక్కా ప్లాన్తో ఇవాళ తహసీల్దార్ ప్రైవేట్ కారు డ్రైవర్ తుప్పాని.గౌతమ్కు బాధితుడు రూ.15వేలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తహసీల్దార్ తీసుకొమ్మన్నారని చెప్పాడు. దీంతో అధికారులు కార్యాలయంలో సోదాలు చేపట్టారు. తహసీల్దార్, అతడి డ్రైవర్ను అదు పులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దాడులు వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారుల నేతృత్వంలో కొనసాగుతున్నాయి..

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise