ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి
నమస్తే భారత్ :-తొర్రూరు
ఎయిడ్స్ రహిత సమాజం కోసం సమిష్టిగా కృషి చేయాలని తొర్రూరు ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు అన్నారు.ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎయిడ్స్ ను నిర్మూలించాలని ఆరోగ్య సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.మండల వైద్యాధికారి డాక్టర్ బి నందనాదేవి తో కలిసి డాక్టర్ సుగుణాకర్ రాజు మాట్లాడారు.ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని అన్నారు. హెచ్ఐవీకి చికిత్స లేదని నివారణ ఒక్కటే మార్గమని తెలిపారు. ఏ ఆర్ టి మందులు వాడటం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. అవగాహన ఉంటేనే ఎయిడ్స్ నుంచి రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ మీరాజ్, డాక్టర్ గిరిప్రసాద్, డాక్టర్ శంకర్, డాక్టర్ అనిల్, సిహెచ్ఓ విద్యాసాగర్,డిపిఎమ్ఓ వనాకర్ రెడ్డి, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
