ముగిసిన రెండో విడత నామినేషన్ల స్వీకరణ
31 సర్పంచ్ స్థానాలకు, 276 వార్డులకు నామినేషన్లు దాఖలు
నమస్తే భారత్ :-తొర్రూరు
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ముగిసింది.మండలంలోని చింతలపల్లి,మాటేడు,హరిపిరాల, వెంకటాపురం,అమ్మాపురం, వెలికట్ట,చర్లపాలెం,గుర్తూరు, మడిపల్లి,నాంచారి మడూరు గ్రామాల్లో అధికారులు నామినేషన్లు స్వీకరించారు.చివరి రోజు 31 గ్రామ సర్పంచ్ స్థానాలకు, 276 వార్డు స్థానాలకు గాను పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన వారిలో ఈదుల కుంట తండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానోత్ రజిని వెంకన్న,పెద మంగ్యా తండా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా జాటోత్ రవి నాయక్,వెలికట్ట కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా.బందు.వెంకన్న,కంటయపాలెం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా మోకాటి సుజాత వెంకన్న లతోపాటు తదితర గ్రామాల నుంచి పలువురు నామినేషన్లు దాఖలు చేశారు.
ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు సమర్పించారు.డిసెంబర్ 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.డిసెంబర్ 6 వరకు ఉపసంహరణ గడువు ఉంది. డిసెంబర్ 6 న పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుందని,అదేరోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు,సర్పంచి ఫలితాలు వెల్లడిస్తామని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు.చివరి రోజు నామినేషన్ కేంద్రాలకు ఆయా పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో నామినేషన్ వేసేందుకు తరలివచ్చారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
