సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలలొ సింగరేణి కబడ్డీ క్రీడాకారుడికి గాయమవడంతో సింగరేణి ప్రధాన ఆసుపత్రి నందు పరామర్శించిన వైస్ ప్రెసిడెంట్ రజాక్ నాయకులు!
నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ డిసెంబర్ 1_)సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్ నందు కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలలో సింగరేణి జట్టు కబడ్డీ కెప్టెన్ కొండ కార్తీక్ ఆట లో భాగంగా గాయపడటంతో సింగరేణి ప్రధాన ఆసుపత్రి నందు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు వారిని పరామర్శించిన కొత్తగూడెం ఏరియా ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ వారితో పాటు కోఆర్డినేటర్ భీముడు, నాయకులు, క్రీడాకారులు సిహెచ్ సాగర్, ఎం కొమురయ్య, పోశం శ్రీనివాస్,షేక్ గులాం గౌస్, భరత్, పాల్గొని, కొండ కార్తీక్ కు మంచి చికిత్స అందించాలని సీఎంఓ రాజ్ కిరణ్ ను కలిసి కార్తీక్ ను శ్రీ రాంపూర్ కు పంపే విధంగా ఆంబులెన్స్ ఏర్పాటు చేయమని చెప్పగానే వారు స్పందించి అంబులెన్స్ ఏర్పాటు చేయడమైనది, దానికి గాను సీ.ఎం.ఓ.కు క్రీడాకారులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు,కార్తీక్ త్వరగా కోలుకోవాలని వారికి ధైర్యం చెప్పి శ్రీరాంపూర్ కీ పంపించడం జరిగింది*
