కోరుట్ల గడి బురుజులు–మహిషాసుర మర్ధిని స్థల పరిరక్షణకు అఖిలపక్ష–ప్రజాసంఘాల పిలుపు
కోరుట్ల, డిసెంబర్ 1: కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక గడి బురుజులు మరియు ప్రతిఏటా దుర్గదేవి పూజల అనంతరం నిర్వహించే మహిషాసుర మర్ధిని స్థల పరిరక్షణ కోసం ఈరోజు సి. ప్రభాకర్ భవనంలో అఖిలపక్ష, ప్రజా సంఘాల సమాఖ్య ముఖ్య సమావేశం జరిగింది. వివిధ పౌర సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మత–సామాజిక సంస్థల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమావేశంలో గడి బురుజులు మరియు మహిషాసుర మర్ధిని స్థల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి:
కన్వీనర్: సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం
కో-కన్వీనర్: సమాజ్ వాది పార్టీ రాష్ట్ర కార్యదర్శి యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముజాహిద్, టిడిపి నాయకులు శ్రీనివాస్ బాబు, తెలంగాణ జర్నలిస్ట్ వర్కింగ్ అసోసియేషన్ ఫౌండర్ రాష్ట్ర అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ లు
ముఖ్య సలహాదారులు : ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్షులు
పేట భాస్కర్, మచ్చ లక్ష్మీపతి, పాతర్ల విజయ్, సుతారి రాములు,
పసుల కృష్ణప్రసాద్, రాచకొండ పెద్ద దేనన్న, భూపెల్లి నగేష్, సయ్యద్ అన్వర్ లతో పాటు పట్టణానికి చెందిన మరికొన్ని కుల సంఘాలను, పాత్రికేయులను, న్యాయ వాదులను భాగస్వామ్యం చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్బంగా కన్వీనర్ చెన్న విశ్వనాథం గారి ఆధ్వర్యంలో 8 డిసెంబర్ 2025 (సోమవారం) న కోరుట్లలో భారీ ధర్నా నిర్వహించేందుకు సమావేశం తీర్మానించింది.
అనంతరం నాయకులు మాట్లాడుతూ
కోరుట్ల గడి బురుజులు మన పూర్వీకుల ఆస్తి, మన చారిత్రక గుర్తింపు. ఈ స్థలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమాల బారిన పడనివ్వము. ప్రతి పౌరుడూ పరిరక్షణలో భాగస్వామి కావాలి అన్నారు.
అదేవిధంగా మహిషాసుర మర్ధిని స్థలాన్ని కూడా సంపూర్ణంగా రక్షించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.
కోరుట్ల భాందవులు, దుర్గా మండలి నిర్వాహకులు, మత–సామాజిక సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమానికి బలమివ్వాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కోరుట్ల పట్టణ ప్రజలందరూ 8వ తేదీ ధర్నాకు భారీగా హాజరై తమ చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వ రక్షణలో ఐక్యంగా నిలవాలంటూ విజ్ఞప్తి చేశారు.
