మేం కేంద్రంలో ఉంటే.. గంటలో ఇచ్చేవాళ్లం !

On
మేం కేంద్రంలో ఉంటే.. గంటలో ఇచ్చేవాళ్లం !

హైదరాబాద్‌, నవంబర్‌ 27 : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తామని భావించామని, ఒకవేళ కేంద్రం లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండి ఉంటే గంటలో రిజర్వేషన్లు దక్కేవని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మా ట్లాడారు.42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నించామని, బీజేపీ సహకరించలేదని పేర్కొ న్నారు. రిజర్వేషన్ల కేటాయింపు శాతాలపై ఉన్నతాధికారులు తప్పకుండా వివరణ ఇస్తారని చెప్పా రు. రిజర్వేషన్లను అడ్డుకుంటున్న వారిపై పోరాడాలని బీసీ సంఘాలను కోరారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తరఫున ఏవైనా లోపాలుంటే చూపించాలని పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా బలహీనవర్గాల బిడ్డ బండి సంజయ్‌ బీసీ బిల్లు ఆమోదించేందుకు చొరవ చూపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise