"నారాయణపేట జిల్లా గడ్డమీద దద్దరిల్లిన దీక్షా దివస్" కార్యక్రమము

On

 

నారాయణపేట జిల్లా / నమస్తే భారత్

ఈ రోజు నారాయణపేట జిల్లా కేంద్రం సింగారం చౌరస్తా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు యస్.రాజేందర్ రెడ్డి, మక్తల్ మాజీ శాసనసభ్యులు,చిట్టెం రామ్ మోహన్ రెడ్డి, కొడంగల్ మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి మరియు జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉద్యమ కారులు, పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ.నవంబర్ 29, 2009 ఇది యావత్తు తెలంగాణ ప్రజలకు ఎంతో సుపరిచిత మైన రోజు.కేసిఆర్  చచ్చుడో.తెలంగాణ వచ్చుడో అని గర్జించి కేసిఆర్ ఆమరణ నిరాహర దీక్ష చేపట్టిన చారిత్రాత్మకమైన రోజు,14 ఏళ్ల సుదీర్ఘమైన మలిదశ ఉద్యమం సాకారమైన రోజు.చావును సైతం లెక్క చేయకుండా కేసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడడం ఫలితంగా, ఎంతో మంది విద్యార్థుల బలిదానాలు కారణంగా, కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు,రిటైర్డు ఉద్యోగులు వంట వార్పు,రైల్ రోకో, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె వంటి మరెన్నో ఉద్యమాలు చేయడం కారణంగా చేసేది ఏమీలేక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది.2004 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామని అప్పటి టిఆర్ఎస్ ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకొని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయడం వల్లనే 2004 నుంచి 2014 వరకు వందల మంది విద్యార్థులు, ఎంతో మంది ఉద్యోగులు ఆత్యహత్యలు చేసుకోవాల్సి వచ్చింది.తొలిదశలో ఎంతో మంది పోరాడినా, మలిదశ ఉద్యమం చేపట్టి చావును సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుక రావడమే కాకుండా, పదేళ్ళ పాటు దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన కేసిఆర్ గారు యావత్తు నాలుగున్నర కోట్ల మంది ప్రజానికానికి తెలుసు.అలాంటి మహానీయుడైన కేసిఆర్ ని ప్రతినిత్యం పూజించినా తప్పు లేదు.మళ్ళీ ఒక్కసారి ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకోవాల్సిన అవసరం నెలకొంది.తదుపరి ఉద్యమ నాయకులకు శాలువ, పూలమాలతో సన్మాన కార్యక్రమము నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు,మండల, గ్రామా కమిటీ సభ్యులు, యువ నాయకులు, సోషల్ మీడియా నాయకులు, ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise