తప్పిన పెను ప్రమాదం

On
తప్పిన పెను ప్రమాదం

Untitled-2 copy.JPG 2

* రైల్వే స్టేషన్ సమీపంలో బోల్తా పడిన కర్ణాటక ఆర్టీసీ బస్సు. 

తుగ్గలి:(నమస్తే భారత్) కర్నూల్ జిల్లా రిపోర్టర్ చిప్పగిరి రాము: తుగ్గలి మండల పరిధిలోని గల రైల్వే స్టేషన్ సమీపము నందు బెంగళూరు నుండి మంత్రాలయం కు వెళ్తున్న కేఏ 43 ఎఫ్ 0834 కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.శనివారం రోజున ఉదయం 5:30 గంటల సమయమప్పుడు డ్రైవర్ బస్సును అదుపు చేయలేక పక్కన ఉన్న పొలాలలోకి వెళ్లి బోల్తా పడింది.బస్సులో 29 మంది ప్రయాణికులు ఉండగా, ఇద్దరికీ స్వల్ప గాయాలైనట్లు రూరల్ సీఐ పులి శేఖర్ గౌడ్,తుగ్గలి ఎస్సై బాల నరసింహులు తెలియజేశారు.ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వారు తెలియజేశారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ పులి శేఖర్ గౌడ్,తుగ్గలి ఎస్సై బాల నరసింహులు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను చక్కదిద్దారు. ఎవరికి ఇటువంటి ప్రమాదం జరగలేదని, స్వల్ప గాయాలైన వారిని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలియజేశారు.బస్సులో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వారు తెలియజేశారు.

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise