విజయవంతమైన రక్తదాన శిబిరం

On
విజయవంతమైన రక్తదాన శిబిరం

 

నారాయణపేట జిల్లా / నమస్తే భారత్

హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరిస్తూ నారాయణపేట జిల్లా  బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో  శనివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  బజరంగ్దళ్ తెలంగాణ ప్రాంత సంయోజక్ శివరాములు, బిజెపి సీనియర్ నాగురావు నామాజీ, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కన్న శివ కుమార్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదాన శిబిరం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణం పోసిన వారం అవుతామన్నారు. యువత స్వచ్ఛదంగా రక్త దాన శిబిరాల్లో పాల్గొని రక్త దానం చేయాలన్నారు. రక్తదాన శిబిరంలో భాగంగా 60 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు మురళి భట్టడ్, కార్యదర్శి ప్రవీణ్, వడ్ల శ్రావణ్ విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise