ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంతో ఘనంగా బీజేపీ సంబరాలు

On
ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంతో ఘనంగా బీజేపీ సంబరాలు

బాన్సువాడ : పట్టభద్రులు, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు  విజయం సాధించడం పట్ల బీజేపీ నాయకులు ఆయా మండలాల్లో సంబరాలు నిర్వహించారు. బాల్గొండ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మల్కా కొమురయ్య, అంజిరెడ్డి విజయం బీజేపీకి ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఓటర్లు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు తగిన గుణపాఠం నేర్పారని అన్నారు.కా ర్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు నక్కల గణేష్, మీసాల చంద్రశేఖర్, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య, ఆరెపల్లి నర్సయ్య, బీజేవైఎం మండల అధ్యక్షులు జక్కం శ్రీకాంత్, ఓబీసీ మండల అధ్యక్షులు కళ్లెం సుధాకర్, ఐటీ సెల్ కన్వీనర్‌ కొత్తింటి రాకేష్, మండల కార్యదర్శి సాయి కిరణ్, మాజీ ఎంపీటీసీ శేరియాల జగన్, బూత్ అధ్యక్షులు ఠాకూర్ రాము, ఉట్నూర్ రాంకిషన్, మగ్గిడి లింగం, అల్లకొండ శేఖర్, తోట నవీన్, ముత్యాల నందిన్, తోట నాగేష్, కడ్తల్ రాజేశ్వర్, బూర్గు భోజేందర్‌, ఎల్లాయి రాజేష్, దుడ్డేల గణేష్, పుట్టి లింగం తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise