Tag
government hospital
రంగారెడ్డి 

ప్రభుత్వాసుపత్రి వైద్యుల తీరు మారదా

ప్రభుత్వాసుపత్రి వైద్యుల తీరు మారదా అత్యవసర సమయంలో సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు.. పేషెంట్ కన్నా ఫోన్ కే  ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వసుపత్రి  వైద్యులు ఫోన్ మాట్లాడుతున్నారని అడిగితే.. నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని కేసులు చూశా. అంటూ బాధితులపై వైద్యురాలి అసహనం..  ప్రభుత్వాసుపత్రి వైద్యులపై చర్యలకు  ఉన్నతాధికారులకు ఫిర్యాదు వైద్యో నారాయణ హరి అంటారు అంటే వైద్యుడు దేవుడితో సమానం కానీ ఇక్కడ మాత్రం  ఈ ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆ పదాలకు రివర్స్ గా పని చేస్తున్నారు ప్రాణాలను అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు సెల్ ఫోన్ కు  ప్రాధాన్యతనిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన లావణ్య అనే మహిళ   ఆర్టిసి బస్సు దిగుతున్న క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడ్ వల్ల కింద పడడంతో తలకు  గాయాలయ్యాయి అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు 108 సహాయంతో గాయాల పాలైన మహిళను  షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read More...

Advertisement