నవ యువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ 

వృత్తి నైపుణ్య శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి - యూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి

నవ యువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ 

 నమస్తే భారత్, రాజేంద్రనగర్, ఏప్రిల్ 20. : వృత్తి నైపుణ్య శిక్షణను ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాలని నవయుగ యూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్  సర్కిల్‌లో నవ యువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంప్యూటర్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం మైలర్ దేవ్‌పల్లి డివిజన్‌లోని భావన ఋషి కాలనీ, శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవనంలో మే 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించగా, విద్యార్థులు, విద్యార్థినులతో పాటు హోమ్ మేకర్స్ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు. శిక్షణలో బేసిక్ కంప్యూటర్ కోర్సు, టైపింగ్ & రైటింగ్, సి లాంగ్వేజ్ లాంటి అంశాలు బోధించనున్నారు.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి మాట్లాడుతూ, యువతకు ఉపయోగపడే ప్రాజెక్టులపై తమ క్లబ్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అలాగే, క్లబ్ సాంస్కృతిక కార్యదర్శి గోంత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ, సాంకేతిక విజ్ఞానం ఈ రోజుల్లో ఎంతో అవసరం కావడంతో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం సామల యాదయ్య, కొంకటి ఆంజనేయులు, చిరంజీవి , ఇప్ప రమేష్, విద్యార్థులు, హోమ్ మేకర్ లు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఆవిష్కరణ కు ముందే.దర్శనం ఇచ్చిన నూకల విగ్రహం. ఆవిష్కరణ కు ముందే.దర్శనం ఇచ్చిన నూకల విగ్రహం.
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : మహబూబాబాద్-మరిపెడ జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన మాజీమంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహం ఆవిష్కరణకు ముందే ప్రజలకు దర్శనం ఇస్తోంది.ఇటీవల గాలిదుమ్ములకు విగ్రహానికి కప్పి...
పేదలకు దక్కని ఇందిరమ్మ ఇల్లు 
ముదిరాజ్ ల సంక్షేమం కోసం కృషి చేస్తా
తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్  మొదటి  సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల.
సారయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
దేవయ్య చిత్రపటానికి నివాళులర్పించిన   సిపిఎంజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాలా వీరయ్య 
కేంద్ర ప్రభుత్వం కులగన లెక్కల నిర్ణయం శుభ పరిణామం