భూ భారతి  చట్టంపై  ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

భూ భారతి  చట్టంపై  ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

 నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా:  రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఈ చట్టం ఎంతో సులభమైన, సరళమైనదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తా వద్ద గల వృత్తి నైపుణ్య అభివృద్ధి శిక్షణా కేంద్రంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు కు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తో పాటు స్తానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి హాజరయ్యారు. సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 14 న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ భారతి పోర్టల్ ను  ప్రారంభించారని, అదే రోజు కలెక్టర్ల తో సీఎం కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి పోర్టల్ లో ఉన్న నియమ నిబంధనల గురించి వివరించారని చెప్పారు. కలెక్టర్లతో పాటు రెవిన్యూ అదనపు కలెక్టర్లు, సీనియర్ రెవిన్యూ ఉన్నతాధికారులు ఈ కొత్త చట్టం లో ఉన్న రూల్స్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేలా సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. అయితే ఈ నెల 17న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలోని మద్దూరు మండలం కాజీపూర్ లో పోర్టల్ పై నిర్వహించిన రెవెన్యూ అవగాహన సదస్సు ను ప్రారంభించారని తెలిపారు. ఆ సదస్సులో మూడు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాట్లు చేసి రైతుల నుంచి అధికారులు దరఖాస్తు స్వీకరించడం జరిగిందని, ఆయా దరఖాస్తుల ను భూ భారతి పోర్టల్ లో నమోదు చేసి వారి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ధరణిలో 33 మ్యాడుల్స్ ఉన్నా  ఏది దేనికోసమో తెలిసేది కాదని, కానీ ఈ కొత్త చట్టం లో సులభతరమైన, అందరికీ అర్థమయ్యేలా 11 మ్యాడుల్స్ ఉన్నాయన్నారు. చాలా సింపుల్ గా పోర్టల్ వెబ్ సైట్ చేశారన్నారు. గతంలో సాదా బైనామా ఒక్కటి కూడా చేయలేదని, కోర్టు స్టే కూడా ఉన్నదని చెప్పారు. ఇప్పుడు సీసీ ఎల్ ఏ నుంచి కోర్టు స్టే ను   వెకెంట్ చేయిస్తారన్నారు.  కొత్త పోర్టల్ లో సింగిల్ఆఫీసర్ కు అధికారాలు ఇచ్చారని, భూ సమస్యలను బట్టి తహాసిల్దార్, ఆర్డిఓ, రెవిన్యూ కలెక్టర్ స్థాయిలో అధికారాలు ఉన్నాయని, వారి పరిధి కంటే ఎక్కువ సమస్య ఉంటే కలెక్టర్ కు అధికారం ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. అదే విధంగా ఈ పోర్టల్ లో అప్పీలు కు ఆస్కారం కల్పించాలని, తహాసిల్దార్ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరముంటే ఆర్డిఓ కు, ఆర్డీవో నిర్ణయం పై కూడా అభ్యంతరం ఉంటే కలెక్టర్ కు అప్పీలు  చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. సమస్య పై కోర్టును ఆశ్రయించే అవకాశమే లేదని కలెక్టర్ తెలిపారు. ఇందులో మరో ముఖ్యమైనది భుదార్ కార్డు అని, ఆధార్ కార్డు ఎలాగో ప్రతి రైతుకు తన భూమికి సంబంధించిన అన్ని వివరాలతో కూడిన భూదార్ కార్డును జారీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కొత్త చట్టం, రూల్స్ గురించి జూన్ 2 తర్వాత  అన్ని గ్రామాలలో సదస్సులు నిర్వహించి అక్కడి రైతుల సమస్యల పై దరఖాస్తు స్వీకరించి, వాటి పరిష్కారానికి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సదస్సులో ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మండలంలో ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేస్తామని, జిల్లా కలెక్టర్, తాను సదస్సుకు వస్తామన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలామంది రైతులు రైతులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతుల గురించి ఆలోచించి  ఈ కొత్త  చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు. ధరణి లో సమస్యలు అన్నీ ఇన్ని కాదన్నారు. అందుకే ధరణి నీ బంగాళ ఖాతం లో కలిపి భూ భారతి చట్టాన్ని తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, అదే చేసి చూపించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కొత్త చట్టంపై అందరికీ అవగాహన ఉంటే ఎవరికి వారే అధికారుల వద్దకు వెళ్లి పని చేసుకోవచ్చన్నారు. ధరణిలో సాదా బైనామా లకు అవకాశం లేకపోయిందని, నియోజకవర్గంలో వెయ్యి సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, నారాయణ పేట మండలంలోనే 200 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కాక  రైతులు కోర్టుకు వెళ్ళా ల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు కోర్టుకు వెళ్లకుండా రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ధరణిలో ఏదైనా సమస్య పరిష్కారం కోసం  దరఖాస్తు చేస్తే వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఉండేదని, ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా. దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైతులందరూ భూ భారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకుని గొడవలు లేకుండా సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు. రైతు సంఘాల నాయకులు భూ భారతి చట్టంపై ప్రతి రైతుకు అవగాహన కల్పించాలని ఆమె కోరారు. ఈ సదస్సులో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, ఆర్టీవో మెంబర్ పోషల్ రాజేష్, స్తానిక తహాసిల్దార్ అమరేంద్ర కృష్ణ, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆవిష్కరణ కు ముందే.దర్శనం ఇచ్చిన నూకల విగ్రహం. ఆవిష్కరణ కు ముందే.దర్శనం ఇచ్చిన నూకల విగ్రహం.
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : మహబూబాబాద్-మరిపెడ జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన మాజీమంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహం ఆవిష్కరణకు ముందే ప్రజలకు దర్శనం ఇస్తోంది.ఇటీవల గాలిదుమ్ములకు విగ్రహానికి కప్పి...
పేదలకు దక్కని ఇందిరమ్మ ఇల్లు 
ముదిరాజ్ ల సంక్షేమం కోసం కృషి చేస్తా
తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్  మొదటి  సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల.
సారయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
దేవయ్య చిత్రపటానికి నివాళులర్పించిన   సిపిఎంజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాలా వీరయ్య 
కేంద్ర ప్రభుత్వం కులగన లెక్కల నిర్ణయం శుభ పరిణామం