వృత్తి విద్యలతో ఉపాధి అవకాశాలు
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.వై నాయక్
నమస్తే భారత్ :-తొర్రూరు : నేటి పరిస్థితులకు అనుగుణంగా యువతకు ఉపయోగపడే వృత్తి విద్యా కోర్సులు నేర్చుకోవాలని, వాటితో ఉపాధి అవకాశాలు పొందవచ్చని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేవై నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల శివారు వెలికట్ట గ్రామ పరిధిలోని పాలకేంద్రం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శారద ఐటిఐ కళాశాలలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రారంభించారు. కళాశాల కరస్పాండెంట్ జాటోత్ శారద రమేష్ తో కలిసి కేవై నాయక్ మాట్లాడారు. ఐటీఐ చదివిన వారికి దశ మారడంతోపాటు నూతన కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశా లు మెరుగు కానున్నాయన్నారు.ఉపాధి లక్ష్యంగా తీర్చిదిద్దిన నూతన కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.సాంప్రదాయ కోర్సులు స్థానంలో వృత్తి విద్య కోర్సులు చదివితే ఎవరి కాళ్లపై వారు నిలబడే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం వృత్తివిద్య కోర్సులకు ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. నేటి పరిస్థితులకు అనుగుణంగా ఐటిఐలో కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.కళాశాల కరస్పాండెంట్ జాటోతు శారద రమేష్ మాట్లాడుతూ.ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్ధ)లో చేరితే తక్కువ సమయంలో ఉపాధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యన్నారు. పాలిటెక్నిక్, వృత్తి విద్యా కోర్సులు అందుబాటులోకి వచ్చినా ఐటీఐకి ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదన్నారు. గత ద శాబ్దం కాలంగా ఐటీఐలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఐటీఐ పూర్తయిన తర్వాత నేరుగా పా లిటెక్నిక్ డిప్లమో రెండో సంవత్సరంలో చేరే అవకాశం కూడా ఉందన్నారు. ఐటీఐ పాసైతే వివిధ సంస్థల్లో, పరిశ్రమ ల్లో ఉద్యోగాలు పొందే వీలుంది. ఈ కారణంగా ఐటీఐ చదివేందుకు యువత ఆసక్తి చూపుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ బాబు,మాజీ జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వసుమర్తి సీతారాములు, పట్టణ అధ్యక్షులు బిందు శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, పిఎసిఎస్ డైరెక్టర్ టికు నాయక్, నాయకులు దామోదర్ రెడ్డి, స్థానికులు రామచంద్రనాయక్, హపావత్ సురేష్, జాటోత్ రాజారాం, తుకారం, హేమా నాయక్, వివిధ కళాశాల ప్రిన్సిపాల్ లు, కళాశాల మేనేజ్మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
