సాయిబాబా కాలనీలో సీసీ రోడ్ల భూమిపూజ
ఆరో వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
నమస్తే భారత్ షాద్నగర్, జూలై 05:
షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో గల సాయిబాబా కాలనీలో శనివారం ఉదయం రూ. కోట్లల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షాద్నగర్ శాసనసభ్యులు శ్రీ వీర్లపల్లి శంకర్ భూమిపూజ నిర్వహించి, అనంతరం కాలనీవాసులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – "ప్రజల అవసరాలు గుర్తించి, వాడివాడలా అభివృద్ధి పనులు కొనసాగిస్తాం. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అభివృద్ధి పనులు చేపడతాం. ఎలాంటి అపోహలకు తావు లేకుండా, వాస్తవ ప్రాతిపదికన అభివృద్ధే మా ద్యేయం. రాజకీయాలకోసం కాదు, ప్రజల శ్రేయస్సుకోసం అభివృద్ధిని కొనసాగిస్తాం," అని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని 6వ వార్డు ఇంచార్జ్ విజయ్ కుమార్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లతాశ్రీ శ్రీశైలం గౌడ్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు.కార్యక్రమంలో అగ్గనూరు విశ్వం, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చందు తిరుపతిరెడ్డి, 22వ వార్డు మాజీ కౌన్సిలర్ సరితా యాదగిరి యాదవ్, డైరెక్టర్ కరుణాకర్, పంచ రాములు, కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మంగ శంకర్, జనరల్ సెక్రటరీ బి. శ్రీనివాసులు, ట్రెజరర్ కే. శ్రీశైలం, గౌరవాధ్యక్షులు ఆంజనేయులు, సమన్వయకర్త డా. కొమ్ము వెంకన్న బాబు, బ్యాంకు వెంకటయ్య, అడ్వకేట్ చంద్రయ్య, అమర్నాథ్ రెడ్డి, భాను శర్మ, గుంటి రమేష్, రాజేష్, రాజు, విశ్రాంత ఉపాధ్యాయులు మందారం నరసింహులు, టీచర్లు క్రాంతి కుమార్, నర్సింలు, యూత్ కాంగ్రెస్ నాయకుడు కిరణ్ నాయక్, శివ (ఎస్పీ), రాజేష్, శ్రీరాములు, రామకృష్ణ, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.కాలనీ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
