సమ సమాజ నిర్మాణమే ఎర్రజెండా లక్ష్యం

సమ సమాజ నిర్మాణమే ఎర్రజెండా లక్ష్యం

 

నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్

పేదల సమస్యలపై పోరాటం ఆపేది లేదు,రాజకీయ విమర్శ లను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి!
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బాల నరసింహా భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)నారాయణపేట జిల్లా రెండవ మహాసభలు మరికల్ మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమాజంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బాల నరసింహా గారు మహాసభ ప్రారంభంలో ఎర్రజెండా అరుణ పతాకాన్నిఎగురవేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ :- కమ్యూనిస్టు పార్టీ మనదేశంలో ఏర్పడి నేటికీ 100 సంవత్సరాలు అయ్యిందని అప్పటినుండి ఇప్పటివరకు ఎప్పుడు  అధికారంలో లేకున్నా నిరంతరం పేద ప్రజల పక్షాన ప్రజలకు అండగా నిలబడి వారికి జరిగే అన్యాయాల పైన దోపిడీల పైన వెట్టి చాకిరి విముక్తి పైన అనేక పోరాటాలు చేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. మనదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి కానీ పేద ప్రజల పక్షాన నిలబడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆయన అన్నారు. 
అదేవిధంగా మనదేశంలో బిజెపి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ లేకుండ పోయింది ఈ దేశంలో ఉన్న మేధావులకు గాయకులకు కవులకు ప్రశ్నించే హక్కు లేకుండా మరి గొంతు నొక్కడమే ప్రధానపనిగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఈ దేశంలో మూడుసార్లు అధికారం లోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఒక కొత్త పరిశ్రమను కూడా తీసుకురాలేదు విద్యార్థుల గురించి మనదేశంలో ఒక యూనివర్సిటీ కూడా తీసుకురాలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఈ ప్రభుత్వం సంవత్సరానికి 20వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోయింది అధికారం వచ్చిన మొదట్లో ప్రపంచంలో ఉన్న నల్ల ధనం తీసుకొచ్చి పేదలకు పంచుతానని చెప్పిన నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు జన్ధన్ ఖాతా ఓపెన్ చేయించి ఒక్క రూపాయి కూడా పేద ప్రజల ఖాతాలో వేయకుండా తిరిగి వారి నుండే సంవత్సరానికి బ్యాంకు చార్జెస్ పేరుపైన 300 నుంచి 500 వరకు కోతలు విధిస్తున్నదని ఆయన అన్నారు. భారతదేశంలో   అనేక మతాలకు చెందిన వారు జీవిస్తున్నారు వాళ్ల మధ్యన ఏనాడు మత ఘర్షణలు లేవు కానీ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి హిందూ మతం పేరు పైన మత రాజకీ యాలు చేస్తూ  ఎన్నికలలో నెగ్గుతూ వస్తుంది ఇది ప్రధానంగా బిజెపి ప్రధాన ఎన్నికల స్టంట్ .
 మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల  రుణమాఫీ చేస్తామన్న మాటను ఇప్పటిదాకా నెరవేర్చుకోలేదు   అదేవిధంగా రైతు భరోసా ఎకరాకు ఒక సంవత్సరానికి పదివేల నుంచి 15 వేల రూపాయలు  ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో చెల్లించలేదు  తక్షణమే ఈ రెండిటిని పూర్తిస్థాయిలో అమలు చేయాలని అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా మొదటి విడతలో ఇస్తున్న ఇండ్లను ఇల్లులేని పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ విజయ రాములు నారాయణపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు నరసింహ వెంకటేష్ సంతోష్ రాము కోస్గి శ్రీను నాగరాజు వివిధ మండలాల గ్రామాల ప్రజలు ప్రతినిధులు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 ఫలాంబరిగా దర్శనమిచ్చిన ఏడుపాయల వన దుర్గామాత ఫలాంబరిగా దర్శనమిచ్చిన ఏడుపాయల వన దుర్గామాత
పన్నపేట, జులై 6 : ఆషాడమాసం రెండవ ఆదివారం పురస్కరించుకొని ఏడుపాయల వన దుర్గాభవాని మాతను ఫలాంబరి రూపంలో రకరకాల ఫలాలతో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని...
హిమాచల్‌ప్రదేశ్‌లో కొనసాగుతున్న వర్షాలు.. 75కు పెరిగిన మరణాలు
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్
బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం : ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం
ఉపాధి హామీ కి నిధులు పెంచాలి రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య 
ఆయిల్ ఫామ్ లక్ష్యాన్ని సాధించే దిశగా చర్యలు చేపట్టాలి.జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్