అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన...
శామీర్ పేట జూలై 3(నమస్తే భారత్)తుర్కపల్లిలోని సెయింట్ మేరీస్ సెంట్రల్ స్కూల్లో గురువారం అగ్ని ప్రమాదాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు అగ్నిమాపక అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రాథమిక అగ్నిమాపక విద్య, అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై వివరమైన సమాచారం ఇవ్వబడింది.
ఈ కార్యక్రమానికి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అగ్నిప్రమాద సమయంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. అలాగే పాఠశాల కరస్పాండెంట్ వరప్రసాద్ రెడ్డి పాల్గొని, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించబడాయి. విద్యార్థులు స్వయంగా పరికరాలను ఉపయోగించి ప్రాక్టికల్ నైపుణ్యాలను అభ్యసించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు శాంతంగా ఎలా స్పందించాలో, ఇతరులను ఎలా రక్షించాలో కూడా నిపుణులు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ గ్రేస్ రెడ్డి, ఉపాధ్యాయులు గౌసియా పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. వారు విద్యార్థులకు భవిష్యత్తులో భద్రతతో కూడిన జీవనశైలి అవలంబించాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగామారి, రక్షణ పరమైన అవగాహనను పెంపొందించింది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

