ఆధారాలు ఉంటే 48 గంటల్లో రుజువు చేయండి
రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తూ ఇతరులపై నిందలు మోపితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం
రాజకీయ నేతల, పారిశ్రామికవేత్తల ఫోన్లు ఎక్కడ ట్యాప్ చేశారో? వారెవరో చెప్పాలి?
ఆధారలుంటే నిరూపించాలి, లేకపోతే న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి
గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే మా ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఫిర్యాదు చేసిన విషయాన్ని మర్చిపోయారా?
ఫోన్ ట్యాపింగ్ పై నిత్యం సుద్దులు చెబుతున్న బిజెపి, కాంగ్రెస్ నేతలకు తెలియదా? కేంద్రంలో, రాష్ట్రoలో అధికారంలో ఉన్నది మేమేనని
ట్యాపింగ్ విషయము సిట్ విచారణలో ఉందనే కనీస సోయి కూడా లేదు
ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి చెప్పొచ్చు కదా?
నియోజకవర్గంలో జరుగుతున్న తప్పుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు
ఏదో బట్ట కాల్చి మీదేసినంతమాత్రాన మేమే సత్యవంతులము అనుకోవద్దు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నేతలు చేసిన ఆరోపణలు ఖండించిన మాజీ మార్కెట్ చైర్మన్ మన్నె కవిత నారాయణ, బీఆర్ఎస్ నాయకులు
నమస్తే భారత్ షాద్ నగర్ జులై03:గత నాలుగు రోజుల క్రితం షాద్ నగర్ నియోజకవర్గంలోని ఓ యువ నాయకుడి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలన్ని మా వద్ద ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిజంగానే ఆ ఆధారాలు మీ వద్ద ఉంటే 48 గంటల్లో రుజువు చేయాలని మాజీ మార్కెట్ చైర్మన్ మన్నె కవిత నారాయణ, బీఆర్ఎస్ నాయకులు సవాలు విసిరారు. లేకపోతే న్యాయపరంగా ఎదుర్కొవాదానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాట్లాడారు. నాలుగైదు రోజుల నుండి మీరు చేసిన ఆరోపణలు, ఆధారాలతో రుజువు చేస్తారని ఎదురు చూశాం, కానీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసం, తమ ఉనికిని కాపాడుకునేందుకు, తాము చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయలేక, ప్రజలకు సమాధానాలు చెప్పలేక అసత్య ప్రచారాలకు దిగుతూ, ఇతర నాయకులపై బురదజల్లే విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు ప్రజా సంక్షేమంపై దృష్టి సారించడం మానేసి కేవలం రాజకీయ లబ్ధి కోసం అర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. గత కొన్ని రోజులుగా కొందరు నాయకులు, పలువురు తమకు ఇష్టమైన రీతిలో ఆరోపణలు చేస్తూ, కథనాలను రాస్తూ సంతోషపడుతున్న వారు ఆధారాలను ఎందుకు రుజువు చేయలేకపోతున్నారని దుయ్యబడ్డారు. ఏదైనా అవినీతికి పాల్పడిన, తప్పుడుగా కార్యక్రమాలకు పాల్పడిన చర్యలు తీసుకునేందుకు చట్టాలు, ప్రభుత్వాలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయారని, కేవలం తప్పుడు ఆరోపణలు చేశాడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఉమ్మడి రాష్ట్ర పాలనలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫిర్యాదు చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు మర్చిపోయారని చురకలంటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని ఇప్పటికి ఎందుకు తెల్చలేకపోతున్నారని, ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ వ్యక్తుల వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేందుకు కంకణం కట్టుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలను మానుకొని ప్రజల సేవలో తరించాలని సూచించారు. ఈ యొక్క సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, నాయకులు పిల్లి శేఖర్, జూపల్లి శంకర్, గుండు అశోక్, సందీప్ సింగ్, శీలం శ్రీకాంత్, రాజశేఖర్, నార్ల శ్రీనివాస్, సంజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

