ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం  అందించాలి  కలెక్టర్,ఎస్పీ

ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం  అందించాలి  కలెక్టర్,ఎస్పీ

 

నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్

ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం త్వరగా అందించేందుకు  అధికారులు  తక్షణ చర్యలు తీసుకోవాలని  నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్  ఆదేశించారు. గురువారం  కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో షెడ్యూల్ కులాలు తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ కేసులను  పోలీసు అధికారులు సీరియస్ గా తీసుకుని  బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.   ఎస్సీ ఎస్టీ  కేసులకు సంబంధించి బాధితులకు నష్టపరిహారం బడ్జెట్ వచ్చిన వెంటనే చెల్లించాలని సూచించారు.  ప్రతీ  మూడు నెలలకోసారి జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు  కలెక్టర్ ఆదేశించారు. గత నెల 11 న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య అధ్యక్షతన స్థానికంగా జరిగిన  సమావేశంలో సూచించిన అంశాలను అందరూ పాటించాలన్నారు.  ప్రతి నెలా చివరి సోమవారం గ్రామాల్లో  పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  సమస్య ఉన్నప్పుడు వెంటనే అధికారులు స్పందించాలని ఆమె తెలిపారు. కాగా అంతకుముందు సమావేశంలో డిఎస్పీ నల్లపు లింగయ్య  2023 నుంచి 2025 వరకు జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుల వివరాలను వెల్లడించారు. సీ సెక్షన్ అధికారిని మాట్లాడుతూ.. 2023 లో నమోదైన 32 కేసులకు గాను 16 కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించడం జరిగిందని, 2024 లో నమోదైన 34 కేసుల్లో ఒక కేసుకు మాత్రమే నష్టపరిహారం చెల్లించడం జరిగిందని, 2025 లో ఇప్పటి వరకు నమోదైన 10 కేసులలో బాధితులకు  బడ్జెట్ లేని కారణంగా నష్టపరిహారం  ఇంకా చెల్లింపు జరగలేదని తెలిపారు. చివరగా 
షెడ్యూల్ కులాలు, తెగల అభివృద్ధి శాఖ అధికారి ఉమాపతి మాట్లాడుతూ జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్ లు ఎక్కడా లేరని వివిధ శాఖల అధికారుల సర్వే ఆధారంగా కేంద్రానికి నివేదిక పంపించడం జరిగిందని తెలిపారు.  ఈ సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డీ  ఖలీల్,డిపిఓ బిక్షపతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జనార్ధన్, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, స్థానిక తహసిల్దార్ అమరేంద్ర కృష్ణ, తదితరులు పాల్గొన్నారు

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
ఖిలావరంగల్‌: పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా...
ఆదివాసీల‌కి ఆర్గానిక్ మామిడి పండ్లు పంపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన రథసారథిగా మహబూబ్నగర్ మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ N.రామచంద్ర రావు
లక్ష్మాపూర్ శివాలంలో సీసీ కెమెరాల ఏర్పాటు!
ఇతర మతాలను కించపరుస్తూ పోస్టులు చేస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐపియస్
గోదావరి నదికి చెందిన ఇసుక రీచ్ ల నుండి స్థానిక సొసైటీల ద్వారా ఇసుక నిలువ చేయడానికి వాహనాలు కావలెను
అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన...