సమాజ సేవలో అంకితభావానికి గౌరవం.వంగూరి యాదవ రెడ్డికి విశిష్ట పురస్కారం
ప్రముఖ హ్యూమనిస్ట్ వంగూరి యాదవ రెడ్డి కి గౌరవ డాక్టరేట్ అవార్డు
ఏసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందజేత.
నమస్తే భారత్ షాద్ నగర్ జూన్29:రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం, గిరి కొత్తపెళ్లి గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు వంగూరి యాదవ రెడ్డి కి గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించింది. ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ తరఫున ఆయనకు ఈ గౌరవం కలిగింది. భాగ్యనగరంలోని నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోనీ ఎన్టీఆర్ ఆడిటోరియంలో శనివారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో ఏషియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ,స్పూర్తి అకాడమీ అధినేత చెన్నారెడ్డి చేతుల మీదుగా వంగూరి యాదవ రెడ్డి గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్, కన్స్యూమర్ ఫోరం ద్వారా సామాజిక సేవ, పార్కింగ్ నిబద్ధత, వాటర్ బాటిల్స్ మీద ఎమ్మార్పీ ఏర్పాటు వంటి సేవలు, అన్ని విభాగాల్లో వంగూరి యాదవ్ రెడ్డి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందించామని నిర్వాహకులు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలోను పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న యాదవ రెడ్డి సేవలు ప్రశంసనీయం అని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు మాట్లాడుతూ... వంగూరి యాదవ రెడ్డి సేవా దృక్పథం, ప్రజల పట్ల నిబద్ధత, విలువలతో కూడిన జీవనశైలి ఆయనను ఈ గౌరవానికి అర్హుడిగా చేశాయని పేర్కొన్నారు.
వంగూరి యాదవ రెడ్డి స్పందిస్తూ.ఇన్నేళ్లుగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేస్తున్న సేవలకు గౌరవ డాక్టరేట్ రూపంలో గుర్తింపు రావడం సంతోషంగా ఉంది అని, దీనికి నా సేవలను గుర్తించి, నిన్ను ప్రతిపాదించి, ఈ అరుదైన గౌరవం దక్కడానికి కారకులైన బహుముఖ ప్రజ్ఞాశాలి నా స్నేహితుడు ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు అని, వెంకన్న బాబు కు సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిలో సామాజిక బాధ్యతను పంచుకుంటూ పని చేస్తే సమాజ అభివృద్ధికి తోడ్పడవచ్చని యాదవ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన యూనివర్సిటీకి, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

