సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు చేయరాదు: జిల్లా ఎస్పీ
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
నారాయణపేట జిల్లా పరిధిలో సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం మరియు ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ. మొహరం పండుగ సందర్భంగా జిల్లా పరిధిలో పీర్ల చావడిల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, నిరంతరం పోలీసు పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని తెలిపారు. ప్రజలు కులమతాలకు అతీతంగా పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్ బుక్ , ట్విట్టర్ , ఇంస్టాగ్రామ్, వాట్సప్ గ్రూపులలో ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా, ఒక వర్గానికి కించపరిచే విధంగా ఉన్న, తమకు తెలియని వీడియోలు, ఫోటోలు పోస్టులు చేసిన, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసిన ఆ గ్రూపు అడ్మిన్ నీ బాధ్యుడిగా చేస్తూ, ఫార్వర్డ్ చేసిన వారిపైన కేసులు నమోదు చేయబడుతాయి అని తెలిపారు. సామాజిక మధ్యమాలను మంచి పనులకు తప్ప వేరే రకంగా వినియోగించే వాళ్లపైన ప్రత్యేకంగ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.జిల్లాలో ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడే వారిని అనుక్షణం పోలీసులు గమనిస్తూ ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది కావున ఈ తరహా నేరలకు పాల్పడే వారిని వెంటనే పట్టుకొని అట్టి వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. పోలీసులు నిరంతరం 24/7 పరిశీలిస్తుంటారని తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు చేసిన, ఫార్వర్డ్ చేసిన జాగ్రత్తగా గమనించి చేయాలని ఎస్పీ సూచించారు. ప్రజలు అత్యవసర సమయంలో నారాయణపేట పోలీస్ కంట్రోల్ రూమ్ 8712670399 కి లేదా డయల్ 100 కి సమాచారమే వాళ్ళని తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

