ఎన్ఎంసీ మార్గదర్శకాలు పాటించాలి

ఎన్ఎంసీ మార్గదర్శకాలు పాటించాలి

 

------- రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ వాసం వెంకటేశ్వర రెడ్డి (ఐఏఎస్).

నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్

నేషనల్ మెడికల్ కౌన్సిల్ ( ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా నారాయణపేట మెడికల్ కళాశాలలో  అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ వాసం వెంకటేశ్వర రెడ్డి (ఐఏఎస్) వాసం వెంకటేశ్వర్ రెడ్డి  సూచించారు. శనివారం నారాయణపేట మండలంలోని అప్పక్ పల్లి వద్ద గల ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి తనిఖీ చేశారు. ముందుగా జిల్లా ఆస్పత్రి లోని అత్యవసర విభాగం, జనరల్ వార్డు, ఐసీయూ, జనరల్ మందుల విభాగాలను పరిశీలించారు. జనరల్ వార్డు లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. కళాశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం  మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ఆస్పత్రి లో ఉన్న వసతి సౌకర్యాలు, అవసరమైన సదుపాయాలు, ఖాళీ పోస్టులు, కళాశాల చుట్టూ ప్రహరీ, మార్చురీ గది నిర్మాణం, జనరేటర్లు, ఆక్సిజన్ ప్లాంటు, ఇంటర్నల్ రోడ్లు, పారిశుద్ధ్య సిబ్బంది, తదితర అంశాలను వివరించారు. జిల్లా జనాభా, మెడికల్ కళాశాల పరిధి, జిల్లా ఆస్పత్రి విస్తీర్ణం,మండలాలు, గ్రామ పంచాయతీలు,ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ ల వివరాలు, సర్జరీలు, ఎన్ని జరుగుతాయో సరాసరి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటెన్ ద్వారా తెలియ జేశారు.  ఈ సందర్భంగా  వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.కళాశాల, జిల్లా ఆస్పత్రి కి ఇంకా ఏయో సదుపాయాలు, వైద్య పరికరాలు, యంత్రాలు అవసరమో గుర్తించి సమగ్ర నివేదిక అందజేయాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ కు సూచించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అనుగుణంగా ఆచార్య పోస్టులు  అవసరం,పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు, అందుబాటులోని సదుపాయాలు, కొత్తగా సమకూర్చాల్సిన వసతుల నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి రెండు రోజుల లోపు ప్రతిపాదనలు పంపుతానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, మెడికల్ కళాశాల డైరెక్టర్  రమేష్, వైద్య నిపుణులు ఆదిత్య, టీజీ ఎమ్ఐడిసి  డీ.ఈ. కృష్ణ మూర్తి, ఏ ఈ సాయి మురారి పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కూటమి ప్రభుత్వం పథకాలను వినియోగించుకోవాలి : పద్మారావు కూటమి ప్రభుత్వం పథకాలను వినియోగించుకోవాలి : పద్మారావు
* వేడంగిలో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసిన పద్మారావు * నమస్తే భారత్  న్యూస్, పోడూరు మే- 28 :కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు...
మరిపెడ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వీడాలి 
మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
ప్రభుత్వ పథకాల లబ్ధి అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటాం: మంత్రి జూపల్లి
మాదకద్రవ్యాల రహిత సమాజానికి ప్రజలంతా కృషి చేయాలి:
సమాజ సేవలో శ్రీమంతుడు శ్రీ.బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారికి గౌరవ డాక్టరేట్ బిరుదుతో సత్కరించిన గ్లోబల్ హ్యూమన్ పీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.
జగన్ విధ్వంసాన్ని సృష్టిస్తే.. చంద్రబాబు అభివృద్ధిని అందిస్తున్నారు : రాష్ట్ర మంత్రి నిమ్మల