కేటీఆర్ పై వ్యక్తిగత హననం చేస్తే ఉరికంచి కొడుతాం
➩ వాంకుడోత్ అశోక్
【భారత రాష్ట్ర సమితి పార్టీ - సోషల్ మీడియా ఇన్చార్జి】
నమస్తే భారత్ :-మరిపెడ
తెలంగాణను ఏర్పాటుచేసిన ఉద్యమ కుటుంబంపై కుట్రలు పన్ని, రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ వ్యతిరేక శక్తులు అంతా కలిసి దాడికి దిగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి ప్రతీకగా మారిన కేటీఆర్ పై పచ్చ మీడియా పద్ధతిలేని ఆరోపణలతో వ్యక్తిగత హననం చేస్తున్న తీరు బాధాకరం.
సామాజిక సేవా సంస్థల నుంచి, అంతర్జాతీయ వేదికల వరకు తెలంగాణ ప్రతిష్టను పెంచిన నాయకుడిపై విమర్శల పేరిట వ్యక్తిగత దాడులు చేయడం ఎవరి అజెండాలో భాగమో ప్రజలకు అర్థమవుతోంది. ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న నాయకుడిపై అసత్య ప్రచారాలు చేసే ప్రతి ఒక్కరికి గట్టి బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది. కేటీఆర్ పై వ్యక్తిగతంగా దాడి చేసిన ప్రతి ఒక్కరిని ఉరికించడమే సమాధానం. మేం ప్రశాంతంగా ఉన్నామంటే దానర్థం భయపడ్డామని కాదు. గౌరవం ఇచ్చేవారికి గౌరవం, హద్దులు దాటి వచ్చినవారిని ఊహించలేని తీరులో ఎదుర్కొంటాం. అని గట్టి హెచ్చరిక జారీ చేస్తున్నా. తెలంగాణను దెబ్బతీసే దుష్టశక్తుల కుట్రలను ప్రజలు తేలిగ్గా అర్థం చేసుకుంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అనేది నాయకుడి పరిరక్షణ కోసం పోరాడే శంఖం. మేం వెనక తగ్గేది లేదు...
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

