సుపరిపాలనపై ప్రజలు సంతోషం సంతృప్తి : రాష్ట్ర మంత్రి నిమ్మల
* ఏడాది కూటమి పాలనతో ప్రతి ఇంటికి లబ్ది
* అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా అడుగులు
నమస్తే భారత్, పాలకొల్లు, జులై 2 :
అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలనలో ప్రజలు సంతోషం, సంతృప్తితో ఉన్నారని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రభుత్వ చేపట్టిన సుపరిపాలనపై తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం పాలకొల్లు మండలం తిల్లపూడి గ్రామంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లారు. ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందజేశారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు తమకు పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని ప్రధానంగా తల్లికి వందనం కింద పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 13వేలు చొప్పున , ఉచిత గ్యాస్ సిలిండర్, పెంచిన పెన్షన్ సొమ్ము, గుంతలు లేని రోడ్లు వంటివి అమలు జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో , నేటి కూటమి ప్రభుత్వంలో ఏడాది పాలన తీరును బేరిజు వేసుకుంటూ కూటమి ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటున్నారన్నారు .వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ వెయ్యి రూపాయల పెంపు ఐదేళ్లు పట్టగా నేడు ఒకేసారి పెంచి అందజేశామన్నారు. వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలు, దివ్యాంగులకు మూడు వేలు, పది వేలు చొప్పున పెంచి అందిస్తున్నామన్నారు. నాడు విధ్వంసం పాలన సాగితే నేడు నిర్మాణ దిశగా పయనిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు ఆశీర్వదించాలని... ప్రజల రుణం తీర్చుకునే విధంగా సేవకునిగా పని చేస్తానని మంత్రి రామానాయుడు తెలిపారు. ముందుగా మంత్రి రామానాయుడు కు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, నాయకులు కోడి విజయభాస్కర్, పాముల రజిని కుమార్, ఇంటి శ్రీరాములు,కామిశెట్టి అయ్యప్ప నాయుడు, నడపన జగపతి నీలం నారాయణమూర్తి, నడపడన నరసింహస్వామి, బోడపాటి కాశీ విశ్వనాథం , బొబ్బనపల్లి రంగారావు, బల్ల, పీతల శ్రీనివాసు, నడపన పురుషోత్తం ( బాబ్జి ) బొబ్బనపల్లి నాగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

