ఆటో డ్రైవర్ల కొరకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి  

ఆటో డ్రైవర్ల కొరకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి  

 

 నమస్తే భారత్ / మద్దూరు, (జూలై 01) : 
 ఆటో డ్రైవర్ల సంక్షేమం కొరకు ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన  హామీ మేరకు 12వేలు ఆర్థిక భృతి ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారము రోజు  భారీ ర్యాలీ నిర్వహించి మండల తహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.
ధర్నా కార్యక్రమానికి తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్ అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం, సిపిఎం జిల్లా కార్యదర్శి, వర్గసభ్యులు  గోపాల్ , రైతుసంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ ముఖ్య వక్తలుగా హాజరై ప్రసంగించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం వలన ఆటో డ్రైవర్స్ తీవ్ర నష్టపోతున్నారని ఆటో డ్రైవర్స్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన  హామీ మేరకు సంవత్సరానికి 12 వేల రూపాయల ఆర్థిక భృతి అందివ్వాలని డిమాండ్ చేశారు.
 పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఆటోల ద్వారా వచ్చే సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
 పెరుగుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితిలో ఆటో డ్రైవర్స్ ఉన్నారని అన్నారు.
 ఆర్టిఓ అధికారుల ,పోలీసు అధికారుల వేధింపులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వేధింపులను ఆపాలని ఉన్నారు ఆటో డ్రైవర్స్ కు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు  ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు .థర్డ్ పార్టీ ఫైనాన్స్ను ప్రభుత్వమే చెల్లించాలన్నారు.
 రోజు మొత్తంగా కష్టపడ్డ 500 నుండి 600 వరకు కూడా రావని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఆరోజు పోలీసుల కంట్లో పడి చలాన్ వేస్తే  తీరని నష్టం ఏర్పడుతుందన్నారు. ఆర్టీఓ,పోలిస్ వేధింపులు 
 ఆపాలని కోరారు.
 అంతకుముందు బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ మీదుగా రావులపల్లి రోడ్డు మీదుగా తాసిల్దార్ కార్యాలయం కు చేరుకున్నారు ఈ ధర్నా కార్యక్రమానికి టిఆర్ఎస్ మండల నాయకులు గోపాల్, రాములు మద్దతు తెలిపి మాట్లాడారు. సిఐటియు నాయకులు, మహమ్మద్ అలీ, శ్రీనివాస్‌,డివైఎఫ్ఐ నాయకులు  మాట్లాడారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడుకున్న వినతిపత్రాన్ని మద్దూరు తాసిల్దార్ మహేష్ కుమార్ గౌడ్ కు అందజేశారు.ఈ ధర్నాలో ఆటో యూనియన్ నాయకులు మాసని కనకయ్య సూరి,బస్వరాజ్ , శివభాస్కర్, హన్మంతు,ఆరిఫ్ వ్యవసాయ కార్మికసంఘం నాయకులు శివకుమార్, హన్మంతుతదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
ఖిలావరంగల్‌: పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా...
ఆదివాసీల‌కి ఆర్గానిక్ మామిడి పండ్లు పంపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన రథసారథిగా మహబూబ్నగర్ మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ N.రామచంద్ర రావు
లక్ష్మాపూర్ శివాలంలో సీసీ కెమెరాల ఏర్పాటు!
ఇతర మతాలను కించపరుస్తూ పోస్టులు చేస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐపియస్
గోదావరి నదికి చెందిన ఇసుక రీచ్ ల నుండి స్థానిక సొసైటీల ద్వారా ఇసుక నిలువ చేయడానికి వాహనాలు కావలెను
అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన...