ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయాలనీ చుస్తే ఉపేక్షించేది లేదు 

ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయాలనీ చుస్తే ఉపేక్షించేది లేదు 

 

ప్రభుత్వ భూముల జోలికి వస్తే చర్యలు తప్పవు 

ప్రభుత్వ భూమినీ ప్రైవేట్ బ్యాంకులో తనకా పెట్టిన భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు 

 శివకుమార్ అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

 శంషాబాద్ మండలం తాసిల్దార్ రవీందర్ దత్తు 

 నమస్తే భారత్ ప్రతినిధి, రాజేంద్రనగర్, జూన్ 24. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప్రభుత్వ భూముల జోలికొస్తే చర్యలు తప్పవని శంషాబాద్ మండల తాసిల్దార్ రవీందర్ దత్తు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో రెవెన్యూ పరిధిలోని  సర్వేనెంబర్ 50లో  శివ కుమార్ అనే పట్టాదారు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం జరిగిందని లోన్ కట్టకపోవడంతో బ్యాంకు వాళ్లు భూమిని స్వాధీనం చేసుకోవడానికి రావడం తో సమాచారం తెలుసుకున్న శంషాబాద్ తాసిల్దార్ రవీందర్ దత్తు, మండల రెవెన్యూ అధికారులు తో కలిసి   సంఘటన స్థలానికి చేరుకొని ఇది ప్రభుత్వ భూమిని ప్రహరీ గోడం తొలగించి అట్టి భూమిని స్వాధీనం చేసుకొని నోటీసు బోర్డుని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల తాసిల్దార్ మాట్లాడుతూ మండల పరిధిలోని మదనపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 50 ఉన్న భూములు ప్రభుత్వ భూములని, ఈ భూముల విషయంలో ఎవరు క్రయవిక్రయాలు జరిపిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వారు అన్నారు. శివకుమార్ అనే వ్యక్తిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం
హనుమకొండ చౌరస్తా, జూన్ 26 : తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీజీపాలీసెట్–2025 అడ్మిషన్ కౌన్సిలింగ్ గురువారం రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్ లైన్ సెంటర్లలో...
ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ లేఖ..
రోడ్డు ఎత్తు పెంచడంతో వర్షం నీరు ఇండ్లలోకి వస్తుందని గ్రామస్థుల ధర్నా
మండలంలో.. మట్టి దొంగలు.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
పహల్గాం ప్రస్తావన లేకుండానే ఎస్సీవో పత్రం.. సంతకం చేయని రాజ్‌నాథ్‌ సింగ్‌
ఒకే వేదిక‌పై సంద‌డి చేయ‌నున్న విజ‌య్ దేవ‌ర‌కొండ, రామ్ చ‌ర‌ణ్
ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమీషన్ చైర్మన్