వృద్ధురాలును చంపి బంగారం దొంగలించకపోయిన కేసులో నేరస్తుని అరెస్టు చేసిన కేసు చేదనలో కీలక పాత్ర వహించిన పోలీస్ అధికారులకు సిబ్బందికి నగదు రివార్డు అందజేసిన పోలీస్ కమిషనర్ మేడమ్ గారు
గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారెడ్డి పల్లి గ్రామ శివారులో నల్ల సత్తవ్వ, వయస్సు: 70 సంవత్సరాలు వ్యవసాయ భూమిలో పనిచేస్తుండగా గుర్తుతెలియని నేరస్తుడు వృద్ధురాలును చంపి బంగారు వస్తువులు దొంగలించకపోయిన కేసులో ఎలాంటి క్లూస్ లేకున్నా గజ్వేల్ ఇన్స్పెక్టర్లు సైదా, ముత్యం రాజు, క్రైమ్ వర్టికల్ మరియు ఐటీ సెల్ సిబ్బంది ఏఎస్ఐ యాదగిరి, కానిస్టేబుళ్లు నరేందర్, వెంకటేష్, రవి, దివ్య, శ్రీకాంత్, రమేష్, సురేందర్, హోంగార్డు నగేష్. టెక్నాలజీ సహాయంతో నేరస్తుని చాకచక్యంగా పట్టుకొని వృద్ధురాలి హత్య కేసును చేదించి ప్రాపర్టీ రికవరీ చేసినందుకు ఈరోజు కమిషనర్ కార్యాలయంలో పోలీస్ అధికారులను సిబ్బందిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ మేడమ్ గారు అభినందించి నగదు రివార్డు అందజేశారు.
గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారెడ్డి పల్లి గ్రామ శివారులో నల్ల సత్తవ్వ, భర్త కీశే,, కిష్టారెడ్డి, వయస్సు: 70 సంవత్సరాలు వ్యవసాయ భూమిలో పనిచేస్తుండగా గుర్తుతెలియని నేరస్తుడు వృద్ధురాలును చంపి బంగారు వస్తువులు దొంగలించకపోయిన కేసులో సీసీ కెమెరాలు, టెక్నాలజీ సహాయంతో నేరస్తుని చాకచక్యంగా పట్టుకొని విచారించి నేరం ఒప్పుకున్నందున అతని వద్ద నుండి 1 ఒక గ్లామర్ బైకు 2 కొడవలి, 3 బంగారపు చైన్, 4 చెవి కమ్మలు, 6 ఒక మొబైల్ ఫోను. స్వాధీనం చేసుకుని నేరస్తుడైన కిచ్చిగారి శివ శంకర్, తండ్రి: కీశే,, నర్సయ్య, వయస్సు : 36 సంవత్సరాలు, వృత్తి: ఆయుర్వేదిక బోన్ సెట్టింగ్ డాక్టర్, నివాసం కోమటిపల్లి, వెల్దుర్తి మండలం, మెదక్ జిల్లా. అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించిన గజ్వేల్ పోలీసులు ఇది విధితమే.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడమ్ గారు మాట్లాడుతూ ఏదైనా కేసు నమోదు కాగానే ఛాలెంజ్ గా తీసుకొని కేసులు చేదించే అధికారులకు సిబ్బందికి మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. అంకితభావంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి ప్రోత్సహించే విధంగా నగదు రివార్డు, అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కేసుల చేతనలో సీసీ కెమెరాలు టెక్నాలజీ చాలా ఉపయోగపడతాయని తెలిపారు. నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు వ్యాపారస్తులు ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఎసిపి నరసింహులు, గజ్వేల్ ఇన్స్పెక్టర్లు సైదా, ముత్యం రాజు, ఎస్బి ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్ గౌడ్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ మల్లేశం గౌడ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

