పరిశుభ్రత అందరి బాధ్యత:ఎంపీడీవో మంగ కుమారి

పరిశుభ్రత అందరి బాధ్యత:ఎంపీడీవో మంగ కుమారి


* పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి 

* స్వచ్ఛతపై కార్మికులకు ప్రజలు సహకరించాలి

* వర్షాకాలం వ్యాధులు కాలంగా గుర్తించి జాగ్రత్తలు పాటించాలి 

*  స్వచ్చాంధ్ర దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజలు భాగస్వామ్యం కావాలి 

నమస్తే భారత్ న్యూస్, పోడూరు, జులై -7 : పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని, గ్రామాల్లో చెత్త సేకరణకు పారిశుధ్య కార్మికులకు ప్రజలు సహకరించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారిని (ఎంపీడీవో) బిఎస్ఎల్ మంగాకుమారి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మంగ కుమారి నమస్తే భారత్ పాత్రికేయునితో మండలంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపడుతున్న చర్యలను వివరించారు. పోడూరు మండల వ్యాప్తంగా 16 గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా పూర్తిస్థాయిలో పారిశుధ్యం పనులు చేపట్టాలని ఇప్పటికే పంచాయితీ కార్యదర్శులకు తెలియజేశామని అన్నారు. వర్షాకాలం వ్యాధుల కాలంగా గుర్తించి ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి ప్రాణాంతకమైన రోగాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్యం పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించామన్నారు. వర్షాల కారణంగా పరిసరాలు తడిగా ఉండకుండా పొడిగా ఉండేలా చూడాలని ఆదేశించామన్నారు. దోమల వ్యాప్తి నివారణకు దోమల మందు పిచికారి, బ్లీచింగ్ చల్లడం వంటి దోమల నివారణ చర్యలు పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని కార్యదర్శులకు ఇప్పటికే సూచించామన్నారు. స్వచ్చాంధ్ర దిశగా ప్రభుత్వం కార్యక్రమాలకు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఎవరికి వారు తమ ఇంటి పరిసరాల్లో చెత్త వేయరాదని, వర్షపునీరు, మురుగు నిల్వ ఉండకుండా స్వచ్ఛందంగా ఎవరికి జాగ్రత్తలు పాటించాలని కోరారు.గ్రామాలను పూర్తిస్థాయి ప్లాస్టిక్ నిర్మూలన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని దానికి అనుగుణంగా గ్రామాల్లో ఏ దుకాణం లోనూ ప్లాస్టిక్ కవర్లు అమ్మకుండా పంచాయతీ కార్యదర్యులు ద్వారా చర్యలు చేపడుతున్నామని అన్నారు.ముఖ్యంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అదేశాలను మేరకు తడిచెత్త, పొడిచెత్తను వేరువేరుగా సేకరించి చెత్తనుండి సంపద సృష్టికి పాటుపడుతున్నామని తెలిపారు. ఇటీవల  ప్రభుత్వం ఆదేశాల ప్రకారం చేపట్టిన యోగాంద్ర కార్యక్రమంలో భాగంగా మండల వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు,సచివాలయం సిబ్బంది ప్రజలతో యోగా చేసేవారిని గుర్తించడం వలన యోగాంద్ర కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. మునుముందు ప్రభుత్వ అదేశాలకు లోబడి ఎటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమంలో విజయం సాధించగలుగుతామని తెలిపారు. అలాగే గ్రామాల్లోని ప్రజలు కూడా ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి కుంటలు నిలవ లేకుండా చూసుకుని ఎవరికి వారు తమ అరోగ్యాలను రక్షించుకోవాలని అలాగే పంచాయతీ వారికి ప్రజలు సహకరించాలని మండల వ్యాప్తంగా గ్రామ ప్రజలను కోరుతున్నామని అన్నారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలి : తహసీల్దార్ జవహర్‌లాల్‌ విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలి : తహసీల్దార్ జవహర్‌లాల్‌
  దామరచర్ల, జులై 8: ప్రభుత్వం ప్రకటించిన మెనూ విధిగా అమలు పరచాలని తహసీల్దార్ బానోతు జవహర్ లాల్ పేర్కొన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మంగళవారం
అర్ధరాత్రి విలయం.. 67 మంది ప్రాణాలు కాపాడిన శునకం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు శుభాకాంక్షలు తెలిపిన బాన్సువాడ
వైఎస్సాఆర్ పేదల పాలిట దేవుడు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Hyderabad Police Deport Four Foreign Nationals Linked to Drug Peddling to Safeguard National Security
జాతీయ మానవ హక్కుల మరియు నేర నియంత్రణ సంస్థ
తిరుమల గుట్ట వెంకటేశ్వరస్వామి దేవాలయ జాతరకు హాజరైన రాజ్ కుమార్ రెడ్డి